Kanguva: కోలీవుడ్‌కు పాన్ ఇండియా హిట్ ఇవ్వాలని సూర్య కలలు
తమిళ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి కానీ అసలైన పాన్ ఇండియన్ సినిమా మాత్రం ఇంకా రాలేదు. అన్నింట్లో ముందున్నా.. ఈ ఒక్క విషయంలో వెనకే ఉన్నారు తమిళ తంబిలు. మరి వాళ్ల ఆశ సూర్య అయినా తీరుస్తారా..? కంగువాతో పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా..? అసలు కంగువా కోసం సూర్య చేస్తున్న ప్లాన్స్ ఏంటి..?
Updated on: Oct 05, 2024 | 10:55 AM

తమిళనాట కంగువాకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకటం కష్టంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ స్లోగా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

కంగువాపై ఆయనకు అంత నమ్మకం ఏంటి..? నిజంగానే కంగువాతో సూర్య పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా..? బాహుబలి, ట్రిపుల్ ఆర్ రేంజ్‌లో కంగువా ఉండబోతుందా..?

ఇదేం స్పీడ్ సామీ..! సూర్యను చూసిన తర్వాత అభిమానులు ఇదే అడుగుతున్నారిప్పుడు. ఓ వైపు కంగువా ఇంకా విడుదలే కాలేదు.. అప్పుడే మరో సినిమాను కూడా పూర్తి చేసారు ఈ హీరో.

కంగువా జాతి తెగ నాయకుడిగా సూర్య నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో హైయ్యస్ట్ బడ్జెట్‌తో వస్తుంది కంగువా. ఒకటి రెండు కాదు.. 38 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కోలీవుడ్‌కు కలగా మిగిలిన పాన్ ఇండియన్ విజయాన్ని కంగువా తీసుకొస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా ముందు ఉన్న ఒకే ఒక్క టార్గెట్ వెయ్యి కోట్లు. ఆ క్లబ్‌లో చోటు కోసమే ప్రతీ స్టార్ హీరో కష్టపడుతున్నారు. అయితే సూర్య మాత్రం అంతకు మంచి కలలు కనడం తప్పేం లేదన్నారు.




