Ram Naramaneni |
Updated on: Aug 08, 2021 | 5:39 PM
ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 5కోసం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ రియాల్టీ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఇప్పుడు సీజన్ 5లో కంటెస్టెంట్స్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ మొదలయ్యే వరకూ కూడా కంటెస్టెంట్స్ పేర్లు బయటకు రాకుండా ‘స్టార్ మా’ వారు జాగ్రత్తపడతారు. అయితే బిగ్ బాస్5లో పాల్గొనబోయేది వీరే అంటూ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.
జబర్దస్ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పేరు కూడా ఇప్పుడు వినిపిస్తుంది. సుధీర్‌ను ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారని, ఇందుకు అతడికి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని టాక్
కాగా బుల్లితెరపై మస్త్ బిజీగా ఉంటూ.. దండిగా సంపాదిస్తున్న సుధీర్‌కు బిగ్ బాస్ నిర్వాహకులు వారానికి ఏకంగా రూ.14 లక్షలు ఆఫర్ చేశారట
భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో సుధీర్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పాడని లీకు వీరుల నుంచి సమాచారం అందుతోంది. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.
కాగా సుడిగాల్ సుధీర్ ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో స్కిట్స్ చేస్తున్నాడు. ఢీ షోలో టీమ్ లీడర్‌గా, శ్రీదేవి డ్రామా కంపెనీ హోస్ట్‌గా కూడా రాణిస్తున్నాడు.