- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Divi Got Offer In Web Series Directed By Kalyan Krishna Divi Latest Photos
Big Boss Divi: భారీ ఆఫర్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. వెబ్ సిరీస్‌లో తళుక్కుమననున్న సొట్టబుగ్గల దివి.
Big Boss Divi: బిగ్‌బాస్ 4వ సీజన్‌లో పాల్గొని ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న అందాల తార దివికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ చిన్నది తాజాగా మరో వెబ్ సిరీస్‌లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది.
Updated on: Aug 08, 2021 | 4:23 PM

బిగ్‌బాస్ రియాలిటీలో షోలో పాల్గొనే ముందు పెద్దగా ఎవరికీ తెలియని దివి, ఈ షో తర్వాత ఒక్కసారిగా లైట్‌లైట్‌లోకి వచ్చింది.

అంతకు ముందు మహార్షి సినిమాలో కనిపించినా పెద్దగా ఎవరికీ తెలియని ఈ బ్యూటీ బిగ్‌బాస్ హౌజ్‌లో తనదైన ఆటతీరు, అందంతో ఆకట్టుకుంది.

ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చేకంటే ముందే సినిమా ఆఫర్‌ను కొట్టేసిందీ బ్యూటీ. చిరంజీవి హీరోగా నటిస్తోన్న వేదాలం రీమేక్‌లో దివి నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక అమ్మడు కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌ల్లోనూ నటించే అవకాశాలను కొట్టేస్తోంది. ఇప్పటికే 'క్యాబ్ స్టోరీస్' సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు మరో ఆఫర్‌ను కొట్టేసినట్లు తెలుస్తోంది.

సొగ్గాడే చిన్ని నాయనా సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో తెరకెక్కుతోన్న ఓ వెబ్ సిరీస్‌లో దివిని తీసుకొనున్నట్లు సమాచారం.

మరి ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఈ వార్తే కనుక నిజమైతే దివి టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.




