- Telugu News Photo Gallery Cinema photos Sreeleela Acted Ad in Director Hanu Raghavapudi Direction and Shares Retro Look Photos telugu movie news
Sreeleela: సీతారామం డైరెక్టర్‌తో శ్రీలీల.. ఎంత అందంగా ఉందో చూశారా..? ఫోటోస్ వైరల్..
గుంటూరు కారం తర్వాత సైలెంట్ అయిపోయింది హీరోయిన్ శ్రీలీల. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ బ్యూటీ నటించినట్లుగా తెలుస్తోంది.
Updated on: Jun 07, 2024 | 6:42 PM

గుంటూరు కారం తర్వాత సైలెంట్ అయిపోయింది హీరోయిన్ శ్రీలీల. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ బ్యూటీ నటించినట్లుగా తెలుస్తోంది. అందులో శ్రీలాల ఓ పల్లెటూరి అమ్మాయిలా.. పాత సినిమాల్లో హీరోయిన్ లా తయారై కనిపిస్తుంది.

ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. రెట్రో షేడ్స్ ను హత్తుకున్నాను. ఒక నటిగా డిఫరెంట్ లుక్స్ ట్రై చేయడం ఆనందంగా ఉంటుంది. ఈ లుక్స్ లో నేను చాలా కొత్తగా కనిపించాను. ఇది ఒక యాడ్ షూటింగ్ కోసం మాత్రమే. హను రాఘవపూడి గారికి నన్ను ఇలా చూపించినందుకు థాంక్యూ అంటూ రాసుకొచ్చింది.

దీంతో శ్రీలీల రెట్రో ఫోటోస్ వైరలవుతున్నాయి. మరి ఆ యాడ్ ఏంటో మాత్రం తెలియాల్సి ఉంది. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీలకు వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ అందులో పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టాయి. దీంతో ఇప్పుడు నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది.

అలాగే అటు ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసే పనిలో ఉందని.. అందుకే సినిమాల వేగాన్ని తగ్గించిందని తెలుస్తోంది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమా కథలను వింటుందని.. త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనుందని టాక్ వినిపిస్తుంది.




