- Telugu News Photo Gallery Cinema photos As Actress Kangana Ranaut wins in Himachal election 2024 then what about her movies Telugu Heroines Photos
Kangana Ranaut: విజయోత్సాహంలో కంగన రనౌత్.. మరి సినిమాల సంగతి ఏంటి అమ్మడు.?
గెలిచిన ఆనందంలో ఉన్నారు కంగనా రనౌత్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని అంటున్నారు. మనలో నిజాయతీ ఉందనిపిస్తే జనాలు ఇలాంటి సక్సెస్‌నే కిరీటంగా పెడతారని ఆనందంగా చెబుతున్నారు. పొలిటికల్‌గా ఆమె చెబుతున్న విషయాల సంగతి సరే.. సినిమాల పరంగా ఆమె ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సినిమాలు చేసేశారు కంగనా రనౌత్.
Updated on: Jun 07, 2024 | 6:12 PM

గెలిచిన ఆనందంలో ఉన్నారు కంగనా రనౌత్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని అంటున్నారు. మనలో నిజాయతీ ఉందనిపిస్తే జనాలు ఇలాంటి సక్సెస్‌నే కిరీటంగా పెడతారని ఆనందంగా చెబుతున్నారు.

పొలిటికల్‌గా ఆమె చెబుతున్న విషయాల సంగతి సరే.. సినిమాల పరంగా ఆమె ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సినిమాలు చేసేశారు కంగనా రనౌత్.

దక్షిణాది సినీ పరిశ్రమను ప్రశంసించడానికి ముందుకొచ్చిన నార్త్ సెలబ్రిటీల్లో కంగనా రనౌత్‌ది ఫస్ట్ ప్లేస్. ఇక్కడి టెక్నీషియన్లను, డిసిప్లిన్‌ని, ప్రతిభను మెచ్చుకోవడానికి ఎప్పుడూ ముందుండేవారు కంగనా రనౌత్.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు కంగనా రనౌత్. ఒకప్పుడు వరసగా విజయాలతో పాటు నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్లుగా ఫామ్‌లో లేరు.

ఇప్పటివరకైతే కంగనకు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉన్నది ఎమర్జెన్సీ మాత్రమే. ఆ తర్వాత కూడా సినిమాలు చేయడానికి ఆమె దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి.

మరి వాటి సంగతేంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. తేజస్ సినిమా రిలీజ్ టైమ్‌లో అయోధ్య గురించి రీసెర్చి చేస్తున్నానని సినిమా చేస్తానని ప్రకటించారు కంగనా రనౌత్.

సీత కేరక్టర్ ప్రధానంగా కంగన కోసం స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. మరి ఈ సినిమాలను పూర్తి చేశాక మేకప్ వేసుకోవడం మానేస్తారా? లేకుంటే ఈ సబ్జెక్టులకు నిర్మాతగా వ్యవహరిస్తారా? అనేది ఇంట్రస్టింగ్ డిస్కషన్.




