- Telugu News Photo Gallery Cinema photos Heroine Alia Bhatt focus on working in south indian languages also Telugu Actress Photos
Alia Bhatt: మనసులోని మాటలు చెప్పేస్తున్న ఆలియా.. ఇలా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు..
ఆలియా ఇప్పుడు జస్ట్ బాలీవుడ్‌కే పరిమితం కాదలచుకోవడం లేదు. తన కెరీర్‌ని అన్ని లాంగ్వేజెస్‌లోనూ విస్తరించాలని అనుకుంటున్నారు. టాప్ ఎండ్‌లో హాలీవుడ్ ఉన్నా, రీజినల్ లాంగ్వేజెస్ మీద కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆలియా మనసులో ఏముంది? ఇంతకు ముందు ఆచితూచి మాట్లాడే ఈ బ్యూటీ ఇప్పుడెందుకు గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు.? ఇంతకు ముందయితే 'నా అభిప్రాయం ఇది' అని ఆలియా అంత పక్కాగా చెప్పడానికి ఇష్టపడేవారు కాదు.
Updated on: Jun 07, 2024 | 5:54 PM

ఆలియా ఇప్పుడు జస్ట్ బాలీవుడ్‌కే పరిమితం కాదలచుకోవడం లేదు. తన కెరీర్‌ని అన్ని లాంగ్వేజెస్‌లోనూ విస్తరించాలని అనుకుంటున్నారు. టాప్ ఎండ్‌లో హాలీవుడ్ ఉన్నా, రీజినల్ లాంగ్వేజెస్ మీద కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు.

ఇప్పుడు ఆలియా మనసులో ఏముంది? ఇంతకు ముందు ఆచితూచి మాట్లాడే ఈ బ్యూటీ ఇప్పుడెందుకు గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు.? ఇంతకు ముందయితే 'నా అభిప్రాయం ఇది' అని ఆలియా అంత పక్కాగా చెప్పడానికి ఇష్టపడేవారు కాదు.

మధ్యేమార్గంగా మాట్లాడుతూ వాక్చాతుర్యంతో నవ్విస్తూ సందర్భాన్ని దాటేయడానికే ట్రై చేసేవారు. కానీ ఇప్పుడు ఆలియాలో మెచ్యూరిటీ బాగా కనిపిస్తోందని అంటున్నారు క్రిటిక్స్.

ఏ విషయాన్నైనా కుండ బద్ధలు కొట్టినట్టు చెబుతున్నారనే ప్రశంసలు అందుతున్నాయి మిసెస్ రణ్‌బీర్ కపూర్‌కి. భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామని అంటున్నారు ఆలియా.

తన దగ్గరకు స్క్రిప్ట్ రాగానే తాను గమనించే ఫస్ట్ విషయం కూడా అదేనని చెబుతున్నారు. తాను అన్ని లాంగ్వేజెస్‌లోనూ సినిమాలను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తానని అన్నారు.

ఏ పాత్ర నచ్చినా నోట్ చేసుకుంటారట ఈ బ్యూటీ. తనకు రీజినల్ లాంగ్వేజెస్ రాకపోయినా ఆయా కేరక్టర్ల భావోద్వేగాలకు కనెక్ట్ అవుతానని అంటున్నారు.

తాను పొరుగు భాషల్లో సినిమాలు చేసేటప్పుడు ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకుంటానని చెప్పారు. హాలీవుడ్ సినిమాకు సైన్ చేసినా, తెలుగులో మూవీ చేసినా అదే హెల్ప్ అయిందని అన్నారు రాహా మదర్.





























