గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన షారూఖ్ ఖాన్, 2024 క్యాలెండర్‌ను మాత్రం స్కిప్ చేశారు. కోవిడ్ కారణంగా ఒకే ఏడాదిలో మూడు రిలీజ్‌లతో సందడి చేసిన బాద్‌షా, ఆ తరువాత ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ కింగ్ అనే సినిమాను ఎనౌన్స్ చేసినా... ఆ మూవీ అప్‌డేట్స్ మాత్రం ఇవ్వటం లేదు.