- Telugu News Photo Gallery Cinema photos Actress Manju Warrier got huge fan following with rajinikanth vettaiyan movie, details here Telugu Heroines Photos
Manju Warrier: 46 ఏళ్ళు.. ఇప్పుడే ఇలా ఉందంటే.. అప్పట్లో చింపేసుంటది.!
అందరూ అనుకుంటున్నారు.. మరి మనం ఎందుకు అనుకోకూడదని అనుకున్నారేమో మంజు వారియర్. అందరూ అనుకుంటున్న విషయానికి డీటైల్స్ యాడ్ చేశారు. అప్పుడెలా ఉన్నది.. ఇప్పుడెలా ఉంటుందన్నదీ.. నెక్స్ట్ ఎలా ఉండబోతున్నదీ వివరించేశారు.. ఇంతకీ దేని గురించి అని ఆలోచిస్తున్నారా.? ఇంతందం అని సీతారామమ్‌లో పాట విన్నారు కదా.. సినిమాలో సిట్చువేషన్ పరంగా ఈ సాంగ్ మృణాల్‌కి ఎంత బాగా సూట్ అయిందో..
Updated on: Oct 02, 2024 | 1:26 PM

అందరూ అనుకుంటున్నారు.. మరి మనం ఎందుకు అనుకోకూడదని అనుకున్నారేమో మంజు వారియర్. అందరూ అనుకుంటున్న విషయానికి డీటైల్స్ యాడ్ చేశారు.

అప్పుడెలా ఉన్నది.. ఇప్పుడెలా ఉంటుందన్నదీ.. నెక్స్ట్ ఎలా ఉండబోతున్నదీ వివరించేశారు.. ఇంతకీ దేని గురించి అని ఆలోచిస్తున్నారా.? ఇంతందం అని సీతారామమ్‌లో పాట విన్నారు కదా..

సినిమాలో సిట్చువేషన్ పరంగా ఈ సాంగ్ మృణాల్‌కి ఎంత బాగా సూట్ అయిందో రియల్ లైఫ్‌లో మంజువారియర్‌కి అంత పక్కాగా సరిపోతుందంటున్నారు జనాలు. ఆమెను స్క్రీన్ మీద చూస్తుంటే పాజిటివ్‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్.

ఫార్టీ ప్లస్‌లో ఇంతందంగా ఎలా ఉన్నారు అని ఎవరైనా మంజు వారియర్‌ని అడిగితే.. ఫార్టీ ప్లస్ కాదు.. ఫార్టీ సిక్స్ అని స్పెల్లింగ్‌ని కరెక్ట్ చేస్తున్నారు మేడమ్ మంజు. తన చిన్నతనంలో ఎవరికైనా 30 ఏళ్లుంటే.. వామ్మో.. పెద్దవారు అనిపించేదట మంజువారియర్‌కి.

కానీ ఇప్పుడు ఫార్టీ సిక్స్ లోనూ తన ఎనర్జీ చూస్తుంటే వావ్ అనిపిస్తోందట. ఫిఫ్టీస్‌లో ఇంకెంత ఎనర్జిటిక్‌గా ఉండాలో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారట ఈ బ్యూటీ. ఇప్పుడు సూపర్ స్టార్‌తో వేట్టయాన్‌లో నటించారు. త్వరలోనే దళపతి 69లో విజయ్‌తో జోడీ కడతారనే వార్తలూ జోరందుకున్నారు.

ఆల్రెడీ మోటార్ రేసింగ్ మీద ఇంట్రస్ట్ పెంచుకుని అజిత్‌కి బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. విజయ్ సేతుపతి అయితే మంజు వారియర్ లైఫ్ స్టైల్‌కి ఫిదా అయిపోయారు. హీరోలందరి దగ్గరా ది బెస్ట్ మార్కులు కొట్టేసి డిస్టింక్షన్ అందుకుంటున్నారు మంజు వారియర్.

అప్‌కమింగ్ హీరోయిన్లకు వండర్‌ఫుల్ ఇన్‌స్పిరేషన్‌గా ఉంటున్నారు. చేయాల్సింది చాలా ఉంది.. ఎక్కువగా పొగడకండి అంటున్న ఈ బ్యూటీ కోసం చాలా స్క్రిప్టులు క్యూ కట్టేస్తున్నాయి మరి..!




