Rajeev Rayala |
Updated on: Oct 02, 2024 | 1:45 PM
టాలీవుడ్ యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. 2007లో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ ముద్దుగుమ్మ.
ఆ సినిమా తర్వాత , నటి హన్సిక మోత్వానీ 2011 సంవత్సరంలో సూరజ్ దర్శకత్వం వహించిన మాప్పిళ్ళై' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ అక్కడ అంతగా సక్సెస్ కాలేదు. దాంతో తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
తెలుగులో ఎన్టీఆర్ కంత్రి, రామ్ పోతినేని కందిరీగ,మస్కా , ప్రభాస్ తో బిల్లా, రవితేజతో పవర్ సినిమాలు చేసింది హన్సిక. హన్సిక తెలుగు, తమిళ్ తో పాటు కన్నడలోనూ ఒక సినిమా చేసింది హన్సిక. అందం అభినయం ఉన్న ఈ అమ్మడు మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది.
నటి హన్సికను తమిళ చిత్ర పరిశ్రమ అభిమానులు కుట్టి కుష్బూ అని పిలుస్తారు. నటి హన్సిక మోత్వానీ అతి తక్కువ సమయంలోనే ప్రముఖ నటీమణుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత గతేడాది 2020 తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది.
డిసెంబర్ 2023లో, హన్సిక తన ప్రియుడు సోహైల్ ఖతురియాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం హన్సిక గాంధారి చిత్రంలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తోంది.