పాన్ ఇండియా సినిమాల్లో… స్పెషల్ సాంగుల సంగతేంటి ??
సినిమాల్లో స్పెషల్ సాంగులకు క్రైటీరియా ఏంటి? కంటెంట్ డిమాండ్ చేస్తే ఐటమ్ సాంగ్ ఉంటుందా? లేకుంటే స్క్రీన్ కలర్‌ఫుల్‌గా కనిపించాలని స్పెషల్ సాంగులను డిజైన్ చేస్తారా? ప్రాజెక్ట్ ప్యాన్ ఇండియా రేంజ్‌ని టచ్ చేస్తే, పక్కాగా ఐటమ్ సాంగులు ఉండాల్సిందేనా? ఇంతకీ రిలీజ్‌కి రెడీ అంటున్న భారీ సినిమాల్లో ఈ సాంగుల కథేంటి? చూసేద్దాం రండి... ఒక్క పాట.. జస్ట్ ఒకే ఒక్క పాట సినిమాకు ఊపు తెస్తుందంటే నమ్మలేం అనే వారు కూడా పుష్ప సినిమాకు నార్త్ లో వచ్చిన క్రేజ్ చూశాక నమ్మి తీరారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: May 01, 2024 | 1:44 PM

సినిమాల్లో స్పెషల్ సాంగులకు క్రైటీరియా ఏంటి? కంటెంట్ డిమాండ్ చేస్తే ఐటమ్ సాంగ్ ఉంటుందా? లేకుంటే స్క్రీన్ కలర్‌ఫుల్‌గా కనిపించాలని స్పెషల్ సాంగులను డిజైన్ చేస్తారా? ప్రాజెక్ట్ ప్యాన్ ఇండియా రేంజ్‌ని టచ్ చేస్తే, పక్కాగా ఐటమ్ సాంగులు ఉండాల్సిందేనా? ఇంతకీ రిలీజ్‌కి రెడీ అంటున్న భారీ సినిమాల్లో ఈ సాంగుల కథేంటి? చూసేద్దాం రండి...

ఒక్క పాట.. జస్ట్ ఒకే ఒక్క పాట సినిమాకు ఊపు తెస్తుందంటే నమ్మలేం అనే వారు కూడా పుష్ప సినిమాకు నార్త్ లో వచ్చిన క్రేజ్ చూశాక నమ్మి తీరారు. ఉ అంటావా... సాంగ్ అన్నీ భాషల్లోనూ ఊపేసింది. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు సెకండ్ పార్టులో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు. ఆగస్టు 15న వచ్చే పుష్ప2లోనే కాదు, అక్టోబర్‌కి సిద్ధమవుతున్న దేవర మీద కూడా ఈ నజర్ బాగానే ఉంది.

స్పెషల్ సాంగులను మరింత స్పెషల్‌గా డిజైన్ చేస్తారనే పేరుంది కొరటాల శివకు. తారక్ ఊరమాస్ గెటప్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడానికి కూడా బోలెడంత స్కోప్ ఉంది. అందుకే తారక్‌తో స్టెప్పులేసే చిన్నది ఎవరంటూ స్వీట్‌గా ఆరా తీస్తున్నారు అభిమానులు. ఇంతకీ భామ పక్కా లోకలా? లేకుంటే నార్త్ నుంచి రావాల్సిందేనా అనేది కూడా ఆసక్తి పెంచుతున్న విషయం. మరి కల్కి సంగతేంటి?

సలార్ ప్రమోషన్స్ విషయంలోనూ హోంబళే ఫిల్మ్స్ ఇదే చేసారు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో గోల చేసారు ఫ్యాన్స్. ఇప్పుడు వైజయంతి మూవీస్‌కు ఈ బాధ తప్పట్లేదు.

ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి.. ఆర్నెళ్లలోనే షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చి. అలా పూర్తైతే డిసెంబర్ నుంచి RC17 సెట్స్‌పైకి రానుంది. మొత్తానికి 2025 పూర్తయ్యేలోపు 3 సినిమాలు చేయాలని చరణ్ ప్లాన్. కానీ అది వర్కవుట్ అయ్యేది మాత్రం దర్శకుల చేతిలోనే ఉంది.





























