- Telugu News Photo Gallery Cinema photos Some Movies release dates changes for Vinayaka chavithi 2023 in film industry Telugu Entertainment Photos
Tollywood: వెనక్కి తగ్గిన తెలుగు సినిమాలు.. ఆ ఊపుతో ముందుకు వస్తున్న తమిళ్ సినిమాలు..
ఏమన్నా అంటే అన్నామంటారు కానీ దర్శక నిర్మాతలు చేసే పనులు మాత్రం అలాగే ఉంటాయి. అరే.. కొత్త సినిమాలకు మంచి రిలీజ్ టైమ్ దొరకట్లేదంటారు.. దొరికినపుడు యూజ్ చేసుకోరు. సమ్మర్‌ను గాలికి వదిలేసినట్లే.. ఇప్పుడు వినాయక చవితిని తీసుకెళ్లి డబ్బింగ్ సినిమాలకు ఇచ్చేసారు. అంతన్నాడు ఇంతన్నాడో అన్నట్లు చివరికి ఒక్క తెలుగు సినిమా కూడా రావట్లేదు గణేష్ పండక్కి.ఏమైందో తెలియదు కానీ ఈ ఏడాది మంచి మంచి సీజన్స్‌ను మన దర్శక నిర్మాతలు వదిలేస్తున్నారు.
Updated on: Sep 07, 2023 | 8:31 PM

ఏమన్నా అంటే అన్నామంటారు కానీ దర్శక నిర్మాతలు చేసే పనులు మాత్రం అలాగే ఉంటాయి. అరే.. కొత్త సినిమాలకు మంచి రిలీజ్ టైమ్ దొరకట్లేదంటారు.. దొరికినపుడు యూజ్ చేసుకోరు. సమ్మర్‌ను గాలికి వదిలేసినట్లే.. ఇప్పుడు వినాయక చవితిని తీసుకెళ్లి డబ్బింగ్ సినిమాలకు ఇచ్చేసారు. అంతన్నాడు ఇంతన్నాడో అన్నట్లు చివరికి ఒక్క తెలుగు సినిమా కూడా రావట్లేదు గణేష్ పండక్కి.

ఏమైందో తెలియదు కానీ ఈ ఏడాది మంచి మంచి సీజన్స్‌ను మన దర్శక నిర్మాతలు వదిలేస్తున్నారు. 2023 సమ్మర్‌ను స్టార్స్ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వినాయక చవితికి తెలుగు సినిమాలేవీ రావట్లేదు. సెప్టెంబర్ 15 కోసం భారీ పోటీ కనిపించింది.. కానీ చివరికిప్పుడు వస్తామన్న వాళ్లంతా వదిలేసారు. స్కంద, టిల్లు స్క్వేర్ వేరే డేట్స్ చూసుకున్నాయి.

బంగారం లాంటి వినాయక చవితి వీకెండ్‌ను పూర్తిగా గాలికి వదిలేసాయి మన తెలుగు సినిమాలు. సెప్టెంబర్ 28కి స్కంద వెళ్తే.. డిజే టిల్లు సీక్వెల్‌కు ఇంకా డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు. దాంతో ఇటు విశాల్.. అటు లారెన్స్ పండగ చేసుకోడానికి రెడీ అయ్యారు.

మార్క్ ఆంటోనీతో విశాల్ వస్తుంటే.. చంద్రముఖి 2తో లారెన్స్ వినాయక చివితి వీకెండ్‌కు బరిలో దిగుతున్నారు. వీటికి ఈ హాలీడేస్ అడ్వాంటేజ్ కానున్నాయి. గతంలో ముని, కాంచన సిరీస్‌తో లారెన్స్ తెలుగులోనూ బ్లాక్‌బస్టర్స్ కొట్టారు. ఇక చంద్రముఖి బ్రాండ్ ఎలాగూ సీక్వెల్‌కు హెల్ప్ కానుంది.

ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. చంద్రముఖి 2 తెలుగులోనూ రప్ఫాడించడం ఖాయం. మరోవైపు మార్క్ ఆంటోనీ ట్రైలర్ అదిరిపోయింది. విశాల్‌కు తెలుగులోనూ మంచి ఇమేజ్ ఉంది. మొత్తానికి మనోళ్లు వదిలేసిన గణేష్ పండగను డబ్బింగ్ హీరోలు ఏ మేర వాడుకుంటారో చూడాలి.




