- Telugu News Photo Gallery Cinema photos Do you know Sara Arjun india's highest paid child actress by 2023 telugu cinema news
Sara Arjun: ఇండియాలోనే అత్యధిక ఆస్తులు కలిగిన చైల్డ్ ఆర్టిస్ట్.. సారా ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా
సారా అర్జున్.. దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. ఈ అమ్మాయిని సారా అనడం కంటే చియాన్ విక్రమ్ కూతురు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. నాన్న సినిమాలో తన నటనతో అంతగా ప్రేక్షకుల హృదయాలను కదలించింది. ఎన్నో చిత్రాల్లో బాలనటిగా కనిపించిన సారా.. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో టీనేజ్ నందిని పాత్రలో కనిపించింది. ఐశ్వర్య రాయ్ పోషించిన నందిని పాత్ర టీనేజ్ అమ్మాయిగా సారా నటించింది.
Updated on: Sep 07, 2023 | 8:07 PM

సారా అర్జున్.. దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. ఈ అమ్మాయిని సారా అనడం కంటే చియాన్ విక్రమ్ కూతురు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. నాన్న సినిమాలో తన నటనతో అంతగా ప్రేక్షకుల హృదయాలను కదలించింది.

ఎన్నో చిత్రాల్లో బాలనటిగా కనిపించిన సారా.. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో టీనేజ్ నందిని పాత్రలో కనిపించింది. ఐశ్వర్య రాయ్ పోషించిన నందిని పాత్ర టీనేజ్ అమ్మాయిగా సారా నటించింది.

ప్రస్తుతం సారా వయసు 17 ఏళ్లు. చిన్నప్పుడు ఎంతో చలాకీగా అనేక చిత్రాల్లో కనిపించిన సారా.. ఆతర్వాత నందిని పాత్రలో నటించడంతో ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోయారు. అంతలోనే ఇంత మార్పా అంటూ నోరెళ్లబెట్టారు.

ఓవైపు బాలనటిగా పలు సినిమాలు చేస్తూనే ఇప్పుడు హీరోయిన్ గా అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సారా తాజాగా ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు బాలనటిగా సారా అర్జున్ రూ.10 కోట్లు సంపాదన కలిగి ఉందట. ఇండియాలోనే అత్యధిక ఆస్తులు కలిగిన చైల్డ్ ఆర్టిస్ట్‌గా రికార్డ్ సొంతం చేసుకుంది. 2006లో జన్మించిన సారా అర్జున్.. 5 ఏళ్ల వయసులోనే హిందీ, తమిళంలో ఎన్నో చిత్రాల్లో బాలనటిగా కనిపించింది.




