- Telugu News Photo Gallery Cinema photos Movie war in Dasara 2023 with star heroes movies Telugu Entertainment Photos
Entertainment: మూడు కాస్తా రెండు అయ్యాయి.? దసరా వార్ సాదాసీదాగా ఉండదు మరి..!
దసరాకు త్రిముఖ పోటీ కాస్తా ద్విముఖ పోటీ కానుందా..? ఎప్పట్నుంచో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న మూడు సినిమాల్లో ఒకటి తప్పుకోనుందా..? ఓ అగ్ర నిర్మాత జోక్యంతోనే ఇదంతా జరుగుతుందా..? ఒకేసారి 3 భారీ సినిమాలు వస్తే అందరికీ నష్టం తప్పదని.. త్రిముఖ పోటీని ద్విముఖ పోటీ చేస్తున్నారా..? అసలు దసరాకు ఏయే సినిమాలు రానున్నాయి.. ఏది రేస్ నుంచి తప్పుకోనుంది..?
Updated on: Sep 07, 2023 | 8:33 PM

దసరాకు మరో 40 రోజులకి పైగానే టైమ్ ఉంది. అయితే ఇప్పటికే మూడు సినిమాలు ఆ పండక్కి రావాలని ఖర్చీఫ్ వేసుకుని కూర్చున్నాయి. మూన్నెళ్ల ముందుగానే భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు దసరాకు రానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే తాజాగా రేస్ నుంచి టైగర్ నాగేశ్వరరావు తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.. దీనిపై క్లారిటీ అయితే లేదు.టైగర్ నాగేశ్వరరావు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అక్టోబర్ 20న విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను ఇంకాస్త ముందుగానే తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రవితేజ ఫారెన్‌లో ఉండటంతో.. ఆయనొచ్చాక రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది. అగ్ర నిర్మాత ఒకరు దగ్గరుండి మరీ.. దసరా రేస్ నుంచి టైగర్ నాగేశ్వరరావును తప్పించి.. భగవంత్ కేసరి, లియోకు లైన్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

భగవంత్ కేసరి, లియోపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ రెండూ అక్టోబర్ 19నే విడుదల కానున్నాయి. ఇంత పోటీలో కాకుండా తమ సినిమాని సోలోగా తెచ్చేందుకు టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా మూడింట్లో ఏ ఒక్కటి డ్రాప్ అయినా.. మిగిలిన రెండు సినిమాలకు అది బాగా కలిసొచ్చే విషయమే. చూడాలిక.. దసరా వార్ ఎలా ఉండబోతుందో..?