తాజాగా శోభిత హాలీవుడ్ లో తెరకెక్కుతోన్న మంకీ మ్యాన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది. తెలుగులో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. వేశ్య పాత్ర చేయడం చాలా గౌరవంగా అనిపించిందని శోభిత తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందని తెలిపింది. అలాగే తన పాత్రతో చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్పుకొచ్చింది.