- Telugu News Photo Gallery Cinema photos Is Heroine Rashmika Mandanna Movie Offers Decreased In Bollywood after animal Telugu Actress Photos
Rashmika Mandanna: బీ-టౌన్ నుంచి రష్మిక యూ-టర్న్.? టైం లేకా.? అవకాశాలు లేకా.?
అలుపూ సొలుపూ లేకుండా ట్రావెల్ చేస్తుంటే, ఎక్కడో ఓ చోట బంపర్ ఆఫర్ తగులుతుంది. కాకపోతే బిగ్ టిక్కెట్ చేతికి దక్కేదాకా ఫోకస్డ్ గా పనిచేయాలి. ఇదిగో.. మన నేషనల్ క్రష్ రష్మిక చేసినట్టు.. అంతే కదా.. శాండిల్‌వుడ్ టు టాలీవుడ్ చేరుకున్న ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో రెడ్ కార్పెట్ ఎవరూ వేయలేదు.. కష్టపడి సాధించుకున్నారు మేడమ్ రష్మిక. ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? సౌత్ గర్ల్స్.. నార్త్ లో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదన్న..
Updated on: Apr 13, 2024 | 7:21 PM

అలుపూ సొలుపూ లేకుండా ట్రావెల్ చేస్తుంటే, ఎక్కడో ఓ చోట బంపర్ ఆఫర్ తగులుతుంది. కాకపోతే బిగ్ టిక్కెట్ చేతికి దక్కేదాకా ఫోకస్డ్ గా పనిచేయాలి. ఇదిగో.. మన నేషనల్ క్రష్ రష్మిక చేసినట్టు.. అంతే కదా.. శాండిల్‌వుడ్ టు టాలీవుడ్ చేరుకున్న ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో రెడ్ కార్పెట్ ఎవరూ వేయలేదు.. కష్టపడి సాధించుకున్నారు మేడమ్ రష్మిక.

ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? సౌత్ గర్ల్స్.. నార్త్ లో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదన్న టర్మ్ మార్కెట్లో ఉన్నప్పుడే ఉత్తరాది వైపు అడుగులేశారు నేషనల్ క్రష్.

కెరీర్ బిగినింగ్‌లో ఆ కల్చర్‌కి తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి కాసింత ఇబ్బంది కూడా పడ్డారు. అయినా ఎక్కడా అధైర్యానికి లోనుకాలేదు. ప్రతి విషయాన్నీ నేర్చుకుని ముందడుగే వేశారు.

అలా ఒకటీ, రెండూ సినిమాలు అయ్యాయి. అయినా సరైన సక్సె్స్ ఏదీ.. అని అనుకుంటున్న టైమ్‌లో తలుపుతట్టింది యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్ హీరోగా నటించిన సినిమా యానిమల్.

ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే రష్మిక కేరక్టర్ మీద ఇంట్రస్ట్ పెంచేసుకున్నారు జనాలు. ఎన్నాళ్లు వేచిన హిట్‌ను నేషనల్ క్రష్‌కి అందించింది యానిమల్ టీమ్. అంతకు ముందు పుష్పతో ప్రూవ్ చేసుకున్నారు రష్మిక.

ఇప్పుడు కూడా ఈ భామ చేతినిండా సినిమాలున్నాయి. కానీ వాటిలో బాలీవుడ్ నుంచి ఎన్ని ఉన్నాయన్నది ప్రశ్న. యానిమల్ సినిమాతో వచ్చిన సూపర్‌సక్సెస్‌ని ఉత్తరాదిన ఈ బ్యూటీ క్యాష్ చేసుకోలేకపోయారా? లేకుంటే,

మీ గెస్ బాగానే ఉంది.! పుష్ప, గేమ్‌చేంజర్ పనుల్లోనే బిజీగానే ఉన్నారు ఇద్దరూ. అయినా.. ట్రెండ్ అవుతున్నది మరో రీజన్‌తో.. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన యానిమల్ సినిమాకు సంబంధించి ఇంకా అప్లాజ్ అందుకుంటూనే ఉన్నారు నటి రష్మిక మందన్న.




