- Telugu News Photo Gallery Cinema photos Manushi Chhillar latest stunning photos goes viral in internet
Manushi Chhillar: ఈ వయ్యారి సొగసును చూసి ఆ చంద్రునికి కూడా సెగలు పుట్టవా..
మానుషి చిల్లర్ చారిత్రాత్మక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్ లో సంయోగిత పాత్రతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత 2023లో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ. 2024లో ఆపరేషన్ వాలెంటైన్ లో కనిపించింది. తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది ఈ అందాల తార. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈ వయ్యారి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..
Updated on: Apr 13, 2024 | 4:51 PM

14 మే 1997న హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌లో హర్యాన్వి కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ మానుషి చిల్లర్. అయితే ఆమె పూర్వీకుల ఝజ్జర్ జిల్లాలోని బమ్నోలి గ్రామనికి చెందినవారు. వృత్తిరీత్యా అక్కడినుంచి వలస వెళ్లారు.

ఆమె తండ్రి డాక్టర్. మిత్రా బసు చిల్లార్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఫిజిషియన్ మరియు సైంటిస్ట్ గా ఉన్నారు. ఆమె తల్లి డాక్టర్ నీలం చిల్లార్ కూడా వైద్యురాలు మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్‌లో న్యూరోకెమిస్ట్రీ అనుబంధ శాస్త్రాలు విభాగానికి డిపార్ట్మెంటల్ హెడ్.

న్యూ ఢిల్లీలో సెయింట్ థామస్ స్కూల్ చదువుకుంది. 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో ఆల్ ఇండియా CBSE టాపర్‌గా నిలిచింది. ఆమె బోర్డులో 96 శాతం స్కోర్ చేసింది. ఆమె తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ (ఇప్పుడు, NEET)లో ఉత్తీర్ణత సాధించింది. ఆమె సోనిపట్‌లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజీలో మెడికల్ డిగ్రీ (MBBS) చదువుతోంది.

మిస్ వరల్డ్ 2017 పోటీ విజేత. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో ఆమె హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 టైటిల్‌ను గెలుచుకుంది. 17 సంవత్సరాల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన భారతదేశం నుండి ఆరవ ప్రతినిధిగా నిలిచింది.

తన మాతృభాష అయిన హర్యాన్వితో పాటు హిందీ, ఇంగ్లీషులో కూడా అనర్గళంగా మాట్లాడగలదు ఈ ముద్దుగుమ్మ. రాజా, రాధా రెడ్డిల కూచిపూడిలో వద్ద శిక్షణ పొందింది ఈ వయ్యారి భామ. 2022 నుంచి నటనలో కెరీర్ మొదలుపెట్టింది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగులో తొలిసారి నటించింది.




