- Telugu News Photo Gallery Cinema photos Sita Ramam beauty Mrunal Thakur is entering the Tamil industry
Mrunal Thakur: తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సీతారామం బ్యూటీ.. ఆ హీరోకి జోడీగా..
హనురాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో హీరోయిన్ గా నటించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా లో మృణాల్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం నాని నటిస్తున్న హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది.
Updated on: Aug 08, 2023 | 11:43 AM

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం నాని నటిస్తున్న హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది.

టెలివిజన్ నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టింది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో ఈ అమ్మడు జెర్సీ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో హీరోయిన్ గా నటించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా లో మృణాల్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆలాగే విజయ్ దేవరకొండ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ అందుకుందట ఈ బ్యూటీ. మురుగదాస్ శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే తమిళ్ నాడులో ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది.





























