- Telugu News Photo Gallery Cinema photos Siddharth Malhotra and Raashii Khanna in Hyderabad for Yodha movie promotions
Yodha: త్వరలోనే ‘యోధ’ చిత్రం విడుదల.. హైదరాబాద్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నా సందడి
హైదరాబాద్ ఫిబ్రవరి 26, 2024 – ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణం లో రూపుదిద్దుకోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్ "యోధ" చిత్ర ప్రమోషన్స్ కోసం ఆ చిత్ర ప్రధాన తారాగణం సిద్ధార్థ్ మల్హోత్రా మరియు రాశి ఖన్నా హైదరాబాద్‌కు చేరుకోవటం తో ఈ చిత్రం పై ఆసక్తి తారా స్థాయికి చేరుకుంది. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మాస్టర్ పీస్ మేకింగ్ గురించి ఆకర్షణీయమైన అంశాలను వెల్లడించారు. అభిమానులకు ఉద్దేశించి సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ "'యోధ'లో భాగం కావడమే ఒక అసాధారణమైన ప్రయాణం.
Updated on: Feb 26, 2024 | 6:33 PM

హైదరాబాద్ ఫిబ్రవరి 26, 2024 – ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణం లో రూపుదిద్దుకోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్ "యోధ" చిత్ర ప్రమోషన్స్ కోసం ఆ చిత్ర ప్రధాన తారాగణం సిద్ధార్థ్ మల్హోత్రా మరియు రాశి ఖన్నా హైదరాబాద్‌కు చేరుకోవటం తో ఈ చిత్రం పై ఆసక్తి తారా స్థాయికి చేరుకుంది. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మాస్టర్ పీస్ మేకింగ్ గురించి ఆకర్షణీయమైన అంశాలను వెల్లడించారు.

అభిమానులకు ఉద్దేశించి సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ "'యోధ'లో భాగం కావడమే ఒక అసాధారణమైన ప్రయాణం. సినిమా కథనం అత్యంత ఆసక్తిగా ఉండటమే కాదు ధైర్యం మరియు దేశభక్తి స్ఫూర్తిదాయకంగానూ ఉంటుంది. ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను " అని అన్నారు.

ఈ సినిమా లో భాగం కావటం పట్ల రాశి ఖన్నా తన సంతోషం వ్యక్తం చేస్తూ, "'యోధ'లో పని చేయడం ఒక ఉత్తేజకరమైన అనుభవం. అటువంటి ప్రభావవంతమైన కథనంలో భాగమయ్యే అవకాశం కల్పించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమా కథనం లోనే ధైర్యం మరియు ప్రేమను అందంగా మిలితం చేశారు. ఇది నిజంగా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని చూడటానికి ప్రేక్షకులతో పాటుగా నేను కూడా ఆసక్తిగా చూస్తున్నాను " అని అన్నారు .

ఇటీవల, మేకర్స్ ఈ చిత్రం నుండి మొదటి పాట "జిందగీ తేరే నామ్" ను విడుదల చేశారు. ఇది ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రా మరియు రాశి ఖన్నాతో కలిసి కీలకమైన పాత్రను పోషించిన బహుముఖ నటి దిశా పటాని "యోధ" కు మరింత ఆకర్షణకు జోడించారు. అన్ని వయసుల ప్రేక్షకులను అలరించే మరపురాని సినిమాటిక్ అనుభూతిని అందించడానికి వీరంతా సిద్ధంగా ఉన్నారు.

ప్రతిభావంతులైన దర్శక ద్వయం సాగర్ ఆంబ్రే మరియు పుష్కర్ ఓజా దర్శకత్వం వహించిన "యోధ" దాని ఆసక్తికరమైన కథాంశంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే వాగ్దానం చేస్తుంది. మార్చి 15, 2024న ఈ చిత్రం విడుదల కానుంది.




