ఈ దేశం నాకు చాలా ఇచ్చింది, కాబట్టి దేశానికి ఏదైనా తిరిగి ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను అని కంగనా చెప్పింది. నేను ఎప్పుడూ నన్ను జాతీయవాదిగా భావించాను. మన సమాజం, మన ఘర్షణలు, మన సంస్కృతి సంప్రదాయాల గురించి లోతైన కథ, కథనంతో సినిమాలు వస్తే అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని కంగనా అభిప్రాయపడ్డారు. జయలలిత పాత్ర తనకు ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు.