- Telugu News Photo Gallery Cinema photos Shruti Haasan Reveals Her Bad Periods Desease Comments Goes Viral telugu movie news
Shruti Haasan: ఆ సమస్యతో బాధపడుతున్న శ్రుతిహాసన్.. ఇప్పటికీ భరిస్తోందట..
విశ్వనాయకుడు కమల్ హాసన్ నటవారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్. కథానాయికగా, సింగర్ రాణిస్తూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేస్తుంది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సలార్ 2లో నటించనున్నట్లు తెలుస్తోంది.
Updated on: Jun 02, 2024 | 11:08 AM

విశ్వనాయకుడు కమల్ హాసన్ నటవారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్. కథానాయికగా, సింగర్ రాణిస్తూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేస్తుంది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సలార్ 2లో నటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని రోజులుగా శ్రుతిహాసన్ పర్సనల్ విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. తన ప్రియుడు శంతను హజారికాతో బ్రేకప్ అయ్యిందంటూ ప్రచారం నడుస్తుంది.

అయితే తన లవ్, బ్రేకప్ రూమర్స్ పై శ్రుతిహాసన్ స్పందించలేదు. కానీ తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ షాకింగ్ విషయం ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అదెంటంటే.. చాలా కాలంగా శ్రుతిహాసన్ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతుందట.

తనకు బ్యా్డ్ పీరియడ్స్ సమస్య ఉందని.. మొదటి నుంచి ఈ సమస్యతో పోరాటం చేస్తున్నట్లు తెలిపింది. ఆ బాధను ఇప్పిటకీ భరిస్తూనే ఉన్నానని... బ్యాడ్ పీరియడ్ సమయంలో ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నానని.. ఆ కారణంగా చాలా విషయాలను కోల్పోయానని తెలిపింది.

కోట్ల రూపాయల ఖర్చుతో చిత్రాలు చేస్తున్న తనకు పీరియడ్స్ సమస్య ఉంది.. షూటింగ్ తర్వాత పెట్టుకోండి అని చెప్పగలనా ? అంటూ ప్రశ్నించింది. చాలా మంది సార్ట్స్, భారీ బడ్జెట్ తో రూపొందితున్న సినిమాల్లో బాధను భరిస్తూ నటిస్తున్నానని.. సాంగ్స్ కోసం డాన్స్ చేస్తున్నట్లు తెలిపింది.




