- Telugu News Photo Gallery Cinema photos Senior producer chanti addala talks about heroine aarthi agarwal and his father
Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ అలా కావడానికి కారణం అతనే.. సంచలన విషయాలను చెప్పిన నిర్మాత..
నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే చిరంజీవి, వెంకటేష్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ సహా దాదాపు అందరు అగ్రహీరోలతోనూ సినిమాల్లో నటించి మంత్రి గుర్తింపు తెచ్చుకుంది ఆర్తి అగర్వాల్.
Updated on: Apr 21, 2021 | 4:46 PM

ఆర్తి అగర్వాల్ వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్ గా కెరీర్ మంచి స్టేజ్‌లో ఉండగానే పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. హీరో తరుణ్‌తో ప్రేమాయణం, ఆపై ఆత్మహత్యాయత్నం వంటివి ఆమె కెరీర్‌లో కోలుకోలేని దెబ్బతీశాయి.

ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత వ్యక్తి గత సమస్యల వలన సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటించిన అంతగా హిట్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే 2015లో ఆపరేషన్ వికటించి గుండెపోటుతో మరణించారు.

తాజాగా ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల ఆర్తి అగర్వాల్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన నిర్మించిన అల్లరి రాముడు, అడవి రాముడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది అందాల నటి ఆర్తి.

ఆమె తండ్రి ఆర్తి విషయంలో సరిగా ఉండి ఉంటే.. ఆమె అలా అయ్యేది కాదంటూ ఆర్తి తండ్రి గురించి.. ఆమె మరణం గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టాడు చంటి అడ్డాల.

ఆమె తండ్రి ఆర్తి అగర్వాల్‌కు సంబంధించి ప్రతీ దాంట్లో ఇన్‌వాల్వ్ అయ్యేవాడని,షూటింగ్‌కు కరెక్ట్ టైంకు వెళ్తానంటే కూడా అడ్డు చెప్పేవాడని పేర్కొన్నారు. ఆర్తి అగర్వాల్ వాళ్ల పేరెంట్స్ మీద చాలా వరకు డిపెండ్ అయ్యేదని, వాళ్లు ఏం చేయమంటే అది చేసేదని చెప్పారు.

వాళ్ల పేరెంట్స్ షూటింగ్ లొకేషన్‌కి రానప్పుడు చాలా కన్వినెంట్‌గా పనిచేసేది. అదే వాళ్లు వచ్చారంటే మాత్రం ఈమెతో పని చేయనిచ్చేవారు కాదు. ఆర్తి అగర్వాల్ తండ్రీ ప్రతిదానికి అడ్డుపడేవాడు. షూటింగ్ ప్యాకప్ ఎప్పుడు చెప్పాలో కూడా ఆయనే డిసైడ్ చేసేవాడన్నారు. Aarthi Agarwal 3

తన తండ్రి వలన ఆర్తి అగర్వాల్ ఇబ్బంది పడేది. ఆయన లేకపోతే ఆమె చాలా ఫ్రీగా పనిచేసేది. నిజానికి ఆమె కెరీర్ ఫేడ్ అవుట్ అవ్వడానికి ఆమె తండ్రే కారణం' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అతను చెప్పిన మాట విని.. ఆమె సినిమాలకు దూరం అయ్యి.. యూఎస్ వెళ్లిపోయి అక్కడ ఉండటం.. లావు అయిపోయి.. సర్జరీలు చేయించుకుని అవి ఫెయిల్ కావడంతో ఆమె అలా అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చారు

ఆర్తి అగర్వాల్...





























