- Telugu News Photo Gallery Cinema photos Sankranthiki Vasthunam child artist Revanth may get a chance in upcoming Mahesh Babu film
బుల్లిరాజుకు బంపర్ ఆఫర్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న బుడతడు
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో బుల్లి రాజు పాత్రలో నటించిన బుడ్డోడికి మంచి పేరొచ్చింది. ఈ బుడతడు తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
Updated on: Jan 22, 2025 | 2:48 PM

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని అందుకుంది..

అంతే కాదు వెంకీ కెరీర్ లో బిగెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో బుల్లి రాజు పాత్రలో నటించిన బుడ్డోడికి మంచి పేరొచ్చింది. ఈ బుడతడు తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

బుల్లి రాజు అసలు పేరు రేవంత్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించాడు. ఇటీవలే మహేష్ బాబును కూడా కలిశాడు ఈ చిన్నది. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి మహేష్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

రాజమౌళి సినిమా తర్వాత ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో బుల్లి రాజుకు ఆఫర్ ఇవ్వనున్నాడట అనిల్. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్ లో తెగ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి.