MAD 2: విడుదలకు రెడీ అవుతున్న మ్యాడ్ 2.. సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్
ఈ రోజుల్లో ఓపెనింగ్‌నే సినిమా రిలీజ్‌లా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తమ సినిమా మొదలైన విషయం ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ కొందరు దర్శకులు ఏ సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఫస్ట్ లుక్ వచ్చే వరకు తెలియదు.. ఆ సినిమా షూటింగ్ పూర్తైనట్లు..! ఇంతకీ ఏంటా సైలెంట్ సినిమాలు..? సౌండ్ లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి కొన్ని సినిమాలు ఈ మధ్య మన ఇండస్ట్రీలో. అందులో సీక్వెల్సే ఎక్కువగా ఉంటున్నాయి.
Updated on: Sep 22, 2024 | 10:01 PM

ఈ రోజుల్లో ఓపెనింగ్‌నే సినిమా రిలీజ్‌లా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తమ సినిమా మొదలైన విషయం ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ కొందరు దర్శకులు ఏ సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఫస్ట్ లుక్ వచ్చే వరకు తెలియదు.. ఆ సినిమా షూటింగ్ పూర్తైనట్లు..! ఇంతకీ ఏంటా సైలెంట్ సినిమాలు..?

సౌండ్ లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి కొన్ని సినిమాలు ఈ మధ్య మన ఇండస్ట్రీలో. అందులో సీక్వెల్సే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు మత్తు వదిలిస్తున్న మత్తు వదలరా 2 చాలా సైలెంట్‌గా షూట్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్ర ప్రెస్ మీట్ పెట్టేవరకు తెలియదు.. దీని సీక్వెల్ రెడీ అయిందని. అంత సైలెంట్‌గా పని పూర్తి చేసారు మేకర్స్. తాజాగా మరో సీక్వెల్ షూటింగ్ కూడా ఇలాగే జరుగుతుంది. అదే మ్యాడ్ 2.

గతేడాది సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన మ్యాడ్ సెన్సేషనల్ హిట్టైంది. దీనికి సీక్వెల్ వస్తుందిప్పుడు. అప్పుడెప్పుడో ఓ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.. ఇప్పుడేకంగా షూట్ అయిపోయిందంటున్నారు. మరో రెండ్రోజుల్లో ఫస్ట్ సింగిల్ కూడా వచ్చేస్తుంది.

మ్యాడ్ 2లోనూ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కంటిన్యూ అవుతున్నారు. ఇక నితిన్ తమ్ముడు అనే ఓ సినిమా చేస్తున్నారని ఎంతమందికి తెలుసు..? వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు మేకర్స్. దిల్, శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజుతో నితిన్ చేస్తున్న సినిమా ఇది.




