- Telugu News Photo Gallery Cinema photos Sandeep Reddy Vanga Vs Shankar with Shah Rukh An interesting news is doing the rounds
South Directors: బాలీవుడ్ లో సౌత్ దర్శకుల హవా.. షారుఖ్ తో మూవీ కోసం ఆ ఇద్దరు..
ఒకప్పుడు నార్త్ స్టార్ హీరోలు సౌత్ కెప్టెన్ల వైపు చూడటం గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఒక్క స్టార్ హీరో, ఇద్దరు సౌత్ కెప్టెన్లు అన్నట్టుంది రేషియో.. ఈ సినారియోలో సందీప్ రెడ్డి వంగా వర్సెస్ శంకర్ విత్ షారుఖ్ అంటూ ఓ ఇంట్రస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ ముగ్గురి పేర్లు వెంట వెంటనే వినడానికే ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ....
Updated on: Feb 11, 2024 | 12:55 PM

ఉత్తరాదికి వెళ్లి బాక్సాఫీస్ బద్ధలు కొట్టిన ఘనతను ఈ మధ్య మన దర్శకులు చాలా మందే సొంతం చేసుకుంటున్నారు. అందులో లేటెస్ట్ సెన్సేషన్ అట్లీ అండ్ సందీప్ రెడ్డి వంగా.

షారుఖ్‌తో జవాన్ మూవీ చేశారు అట్లీ. ఆ సినిమా వెయ్యి కోట్ల మార్కు దాటేసరికి ఒక్కసారిగా బాలీవుడ్ బాద్షా చూపు సౌత్ కెప్టెన్ల మీద పడిపోయింది. జబర్దస్త్ కథలతో ఇంకా ఎవరెవరున్నారా? అంటూ ఆరా తీస్తున్నారట కింగ్ ఖాన్.

ఈ క్రమంలో ఆయనకు వెంటనే గుర్తుకొస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్, రష్మికతో సందీప్ చేసిన మాయ చూసి ఫిదా అయిపోయారట షారుఖ్. టీజర్ రిలీజ్ కాకమునుపే షారుఖ్‌కి చూపించారట కెప్టెన్ వంగా. ఇప్పటికే వీరిద్దరి మధ్య రెండు మీటింగులు కూడా జరిగాయట.

రణ్‌వీర్‌సింగ్‌తోనూ, షారుఖ్‌తోనూ సినిమా చేయాలని ఉందని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు సందీప్ రెడ్డి వంగా. ఆల్రెడీ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ కోసం స్పిరిట్ పనుల్లో ఉన్నారు. ఇది పూర్తయ్యాక షారుఖ్ కోసం స్క్రిప్ట్ చేస్తారా? అనే టాక్ కూడా వినిపిస్తోంది నార్త్ సైడ్.

మరోవైపు గతంలో చాలా సార్లు వినిపించిన శంకర్ - షారుఖ్ కాంబో గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం గేమ్ చేంజర్, ఇండియన్2 సినిమాలతో బిజీగా ఉన్న శంకర్, ఇవి పూర్తి కాగానే షారుఖ్ కోసం ఓ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తారన్నది టాక్.మరి షారుఖ్ ఇమీడియేట్ కాల్షీట్ శంకర్‌కి ఇస్తారా? లేకుంటే సందీప్ రెడ్డి వంగాకి ఇస్తారా? అనేది ఇండియన్2 రిజల్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుందంటున్నారు క్రిటిక్స్.




