- Telugu News Photo Gallery Cinema photos Samantha, Shubham Movie Team Visit Lord Venkateswara Swamy in Tirumala
తిరుమలలో సమంత..ఆ మూవీ హిట్ అవ్వాలని పూజలు!
అందాల ముద్దుగుమ్మ సమంత శుభం మూవీతో నిర్మాతగా పరిచయం కానుంది. ఈ ముద్దుగుమ్మ సొంతంగా ట్రలాలా బ్యానర్ నిర్మించిన విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ నుంచి మొదటగా శుభం అనే తొలిసినిమా విడుదల కానుంది. దీంతో ఈ బ్యూటీ, శుభం మూవీ టీం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.
Updated on: Apr 20, 2025 | 1:54 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. వరసగా సినిమాలు చేస్తూ.. చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వెళ్లిన అతి కొన్ని రోజుల్లో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది.

ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ట్రలాలా అనే సొంత బ్యానర్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ పై అతి త్వరలో శుభం మూవీ విడుదల కానుంది.

దీంతో ఈ మూవీ మంచి హిట్ అందుకోవాలని హీరోయిన్ సమంత, శుభం మూవీ టీంతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.

తన కెరీర్ లో సొంత బ్యానర్ పై వస్తున్న తొలి సినిమా కావడంతో మంచి హిట్ అందేలా ఆశీర్వదించాలని సమంత తిరుమలకు వెళ్లి ముక్కులు చెల్లించింది. ఈ క్రమంలో సమంత తన ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా శుభం టీమ్ కుదర్శనం అయ్యేలా చూసింది.

దర్శనానంతరం నటికి, మూవీ టీంకు రంగనాయుకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక శుభం మూవీ మే 9న అభిమానుల ముందుకు రానుంది.



