- Telugu News Photo Gallery Cinema photos Samantha quashes rumours of her coming to Ye Maaya Chesave movie re release promotions
Samantha Ruth Prabhu: ఆ సినిమా ప్రమోషన్స్‌కు నేను రాను.. తెగేసి చెప్పిన సమంత..
స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారనుంది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన సమంత.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు. సమంత అందానికి, నటనకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు. తన నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
Updated on: Jun 18, 2025 | 1:51 PM

స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారనుంది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన సమంత.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు. సమంత అందానికి, నటనకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు. తన నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ నటిస్తూ మెప్పిస్తుంది. సిటాడెల్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామ్ గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఈ సిరీస్ తో హిందీ ఆడియన్స్ కు దగ్గరయిన సామ్ ఇప్పుడు. సిటాడెల్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే వరుస సినిమాలతో బిజీ కానుంది సామ్.

సమంత నటిగానే కాదు.. ఇటీవలే నిర్మాతగా మారింది. నిర్మాతగా మారి సమంత చేసిన సినిమా శుభం.. హారర్ కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది సమంత..

టాలీవుడ్ లో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఏ మాయ చేసావే .. క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అలాగే ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఈ ఇద్దరు ప్రేమలో పడటం జరిగింది.

త్వరలోనే ఏ మాయ చేసావే సినిమా రీ రిలీజ్ కానుంది. వచ్చే నెల 18న రీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సామ్ పాల్గొంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా దీని పై సమంత క్లారిటీ ఇచ్చింది. ఏ మాయ చేసావే సినిమా ప్రమోషన్స్ లో తాను పాల్గొనడం లేదని తెలిపింది. అసలు ఈ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు అర్ధం కావడం లేదని తెలిపింది సమంత.. నిజం చెప్పాలంటే ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటున్నా అంటూ స్పష్టం చేసింది.




