Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్న సమంత.. వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతున్న ముద్దుగుమ్మ
సమంత ఇప్పుడు జోరు మీదున్నారు. అలాగని వరుసగా సినిమాలు చేసేస్తున్నారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆమె జోరు మొత్తం సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. లేటెస్ట్ గా సాకీ కోసం సమంత చేసిన ఫొటో షూట్ ఇన్‌స్టాలో ఇన్‌స్టంట్‌గా వైరల్ అయింది. నేను బ్రేక్ తీసుకున్నది సినిమాల నుంచేగానీ, సోషల్ మీడియా నుంచి కాదని ఓపెన్‌గానే షో చేస్తున్నారు సమంత. వారానికి ఒకసారి కచ్చితంగా ఏదో ఒక పోస్ట్ తన హ్యాండిల్ మీద ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, కమర్షియల్స్ కి మాత్రం దూరం కాలేదు సామ్.
Updated on: Oct 27, 2023 | 2:45 PM

సమంత ఇప్పుడు జోరు మీదున్నారు. అలాగని వరుసగా సినిమాలు చేసేస్తున్నారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆమె జోరు మొత్తం సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. లేటెస్ట్ గా సాకీ కోసం సమంత చేసిన ఫొటో షూట్ ఇన్‌స్టాలో ఇన్‌స్టంట్‌గా వైరల్ అయింది.

నేను బ్రేక్ తీసుకున్నది సినిమాల నుంచేగానీ, సోషల్ మీడియా నుంచి కాదని ఓపెన్‌గానే షో చేస్తున్నారు సమంత. వారానికి ఒకసారి కచ్చితంగా ఏదో ఒక పోస్ట్ తన హ్యాండిల్ మీద ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, కమర్షియల్స్ కి మాత్రం దూరం కాలేదు సామ్. మయొసైటిస్ గురించి అవగాహన కల్పించడానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారంటూ ఓ దఫా వైరల్ అయ్యారు సామ్. ఆ తర్వాత కూడా విదేశాల్లో ఆమె తీసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.

తాను ఎక్కడికి వెళ్లినా, తన ఆలోచనలు ఎలా ఉన్నా, ఏ పుస్తకాన్ని చదువుతున్నా, అందులో నచ్చిన కోట్ ఏం ఉన్నా, వెంటనే అభిమానులతో పంచుకోవడం అలవాటు చేసుకున్నారు సామ్. ఓ వైపు... తానెలా ఉన్నాననే విషయాన్ని కన్వే చేస్తూనే, మరోవైపు తాను రొటీన్‌గా ఎండార్స్ చేసే బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు సామ్.

జువెలరీ, కుకింగ్ ఆయిల్స్ తో పెయిడ్ ప్రమోషన్లతో పాటు, అప్పుడప్పుడూ తనకు నచ్చిన వారితో హెయిర్ స్టైల్స్ చేయించుకుంటూ, నచ్చిన కాస్ట్యూమ్స్ ధరించి ఫొటో షూట్‌లు చేస్తూ కూడా ఫాలోయర్స్ తో టచ్‌లోనే ఉంటున్నారు సామ్.

నార్త్ లో సిటాడెల్ తప్ప, సౌత్‌లో సమంత చేతిలో ఏ ప్రాజెక్టూ లేదు. కావాలనే కాస్త గ్యాప్ తీసుకున్నారు సమంత. మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమయంలోనే, కాస్త ఓపిక చేసుకుని నచ్చినట్టు ఉంటున్న ఆమెకు ఫ్యాన్స్ కుడోస్ పలుకుతున్నారు.




