- Telugu News Photo Gallery Cinema photos Actress Malavika Mohanan Hot photos goes attractive in social media on 27 10 2023 Telugu Heroines Photos
Malavika Mohanan: ఆ భామ అందానికి తగిన ప్రతిఫలం దక్కుతుందా..? మాళవిక హాట్ షో..
అప్పుడప్పుడూ స్టార్ హీరోలతో నటించినా కూడా రేసులోకి మాత్రం ఎప్పుడూ రాలేదు. తాజాగా మరో హీరోయిన్ కూడా గ్లామర్ షోలో రెచ్చిపోతుంది. ఆమెవరో కాదు.. మాళవిక మోహనన్. మాస్టర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు మాళవిక. తొలి సినిమానే ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరోతో నటిస్తుంది ఈ బ్యూటీ.
Updated on: Oct 27, 2023 | 7:00 PM

ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం ఉండదు పాపం. అది లేకే చాలా మంది హీరోయిన్స్ అలా మిగిలిపోతుంటారు. తెలుగులో ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్, రెజీనా, రాశీ ఖన్నా లాంటి హీరోయిన్లకు ఎంత అందం ఉన్నా.. గ్లామర్ షో చేసినా కూడా వాళ్లు స్టార్ హీరోయిన్లు కాలేకపోయారు.

అప్పుడప్పుడూ స్టార్ హీరోలతో నటించినా కూడా రేసులోకి మాత్రం ఎప్పుడూ రాలేదు. తాజాగా మరో హీరోయిన్ కూడా గ్లామర్ షోలో రెచ్చిపోతుంది. ఆమెవరో కాదు.. మాళవిక మోహనన్. మాస్టర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు.

తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు మాళవిక. తొలి సినిమానే ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరోతో నటిస్తుంది ఈ బ్యూటీ. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో మాళవిక మోహనన్ ఓ హీరోయిన్. ఈమెతో పాటు మరో ఇద్దరు బ్యూటీస్ కూడా ఈ సినిమాలో ఉన్నారు.

అయితే మెయిన్ హీరోయిన్ మాత్రం మాళవికే. ఈ సినిమాతో తనకు తెలుగులో మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతుంది మాళవిక. తమిళంలో విజయ్ లాంటి హీరోతో నటించిన తర్వాత కూడా ఈమెకు పెద్దగా ఫోకస్ అయితే రాలేదు. దాంతో గ్లామర్ షోకు తెర తీసింది ఈ బ్యూటీ.

అది కూడా అలాంటిలాంటి గ్లామర్ షో కాదు.. ఏకంగా గూగుల్ తల్లికి కూడా చెమటలు పట్టించేలా రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. కచ్చితంగా ఈ అందాల ఆరబోత చూసిన తర్వాత దర్శకుల నుంచి పిలుపు వస్తుందని ఆశ పడుతుంది మాళవిక మోహనన్.

తాజాగా నీటిలో ఈమె చేసిన హాట్ ఫోటోషూట్ ఒకటి వైరల్ అవుతుంది. రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది ఈ ఫోటోషూట్. అందులో వైట్ క్యాస్ట్యూమ్‌లో అచ్చం దేవకన్యలా మారిపోయింది మాళవిక.

ఇంత అందాన్ని చూసిన తర్వాత కూడా మన దర్శక నిర్మాతలు ఈమెపై ఫోకస్ చేయలేదంటే మాత్రం.. అంతకంటే దురదృష్టం మరోటి ఉండదేమో..? ప్రస్తుతానికి తెలుగుతో పాటు తమిళ, మలయాళంలోనూ నటిస్తుంది మాళవిక.రేపు ప్రభాస్ సినిమా విడుదలైతే కానీ తెలుగులో ఈమె పరిస్థితి ఏంటనేది తెలియదు. అప్పటి వరకు ఇలా హాట్ పోటోషూట్స్‌తో కాలం గడిపేయడమే.




