Movie Updates: భారీ ధరకు అమ్ముడుపోయిన ‘సలార్’ ఆంధ్రా రైట్స్.. కాంతారా 2 న్యూ లుక్ రిలీజ్

సలార్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ రైట్స్ డీటెయిల్స్ అనౌన్స్ చేసారు మేకర్స్. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో తేజ మార్ని తెరకెక్కిస్తున్న సినిమా ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’.  లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) తో ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. కన్నడ ఇండస్ట్రీలో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన సినిమా కాంతార. 

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Nov 16, 2023 | 8:42 AM

సలార్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ రైట్స్ డీటెయిల్స్ అనౌన్స్ చేసారు మేకర్స్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీ సిరి సాయి సినిమాస్, తూర్పుగోదావరిలో లక్ష్మీ నరసింహ శ్రీ మణికంఠ ఫిలిమ్స్, పశ్చిమ గోదావరిలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, కృష్ణా, గుంటూరు రీజియన్లలో KSN టెలిఫిలిమ్స్, నెల్లూరులో శ్రీ వెంగబాంబ సినిమాస్, సీడెడ్‌లోని శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ సలార్ సినిమాను విడుదల చేయబోతున్నారు.

1 / 5
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా మంగళవారం. ఆమెకు జోడీగా రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. అయితే ఒకరోజు ముందుగానే ఈ చిత్ర పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్.

2 / 5
 శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో తేజ మార్ని తెరకెక్కిస్తున్న సినిమా ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి’ పాట యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. కచ్చితంగా ప్రేక్షకులు ఎగ్జైట్ అయ్యే ఫీల్ ఉంటుందని చెప్పారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా వస్తున్న కోట బొమ్మాళి పిఎస్ నవంబర్ 24న విడుదల కానుంది.

3 / 5
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) తో ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇందులో భాగంగా ఆయన తీసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు సంచలన విజయం సాధించాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం LCUలో నెక్ట్స్ రాబోయే సినిమాల్లో కొన్నింటిని లోకేష్ అసిస్టెంట్స్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

4 / 5
కన్నడ ఇండస్ట్రీలో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన సినిమా కాంతార. తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అద్భుతాలు చేసింది. ఈ సినిమా సీక్వెల్ చేస్తున్నారిప్పుడు రిషబ్ శెట్టి. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలోని లుక్ బయటికి వచ్చింది. దీనికోసం రిషబ్ పూర్తిగా మేకోవర్ అయిపోయారు. 2024లో విడుదల కానుంది కాంతార 2.

5 / 5
Follow us