- Telugu News Photo Gallery Cinema photos Records are broken before releasing allu Arjun Pushpa 2 the rule movie
Puhspa 2 The Rule: రిలీజ్ కాకుండా రికార్డులు బ్రేక్ అవుతున్నాయ్.! కానీ సుకుమార్ ఎక్కడ.?
ఇప్పటిదాకా ఏం చూశారనీ.. ఇకపై చూస్తారు.. సిసలైన ప్రమోషన్లంటే ఎలా ఉంటాయో అని అంటోంది పుష్ప టీమ్. నార్త్ లో రిలీజ్ చేసిన ట్రైలర్, చెన్నై వైల్డ్ ఫైర్ ఈవెంట్‌ని మించేలా కేరళ, తెలుగు ఈవెంట్స్ ఉండబోతున్నాయా? ఆల్రెడీ మొదలైన రికార్డుల మోత ఇంకా గట్టిగా మోగిపోనుందా.. పుష్ప టీమ్ ఏ పని చేసినా ఇప్పుడు అదో రికార్డు. లేటెస్ట్ గా కిస్సిక్ సాంగ్ అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా పాతిక మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుని కిస్సిక్ రికార్డు కొట్టేసింది.
Updated on: Nov 27, 2024 | 10:06 PM

బాలీవుడ్‌లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం..! న్యూ ఇయర్ కాదు.. సంక్రాంతి వరకు అక్కడ పుష్ప దూకుడు ఖాయం.

ఇప్పటిదాకా ఏం చూశారనీ.. ఇకపై చూస్తారు.. సిసలైన ప్రమోషన్లంటే ఎలా ఉంటాయో అని అంటోంది పుష్ప టీమ్. నార్త్ లో రిలీజ్ చేసిన ట్రైలర్, చెన్నై వైల్డ్ ఫైర్ ఈవెంట్‌ని మించేలా కేరళ, తెలుగు ఈవెంట్స్ ఉండబోతున్నాయా?

ఆ మధ్య పాట్నా ఈవెంట్, సండే చెన్నై ఈవెంట్ ఎంత సందడిగా జరిగాయో చూశాం.. ఇప్పుడు కేరళలో హవా ఎలా ఉంటుందో విట్‌నెస్ చేయడానికి రెడీగా ఉండమని హింట్ ఇస్తున్నారు మేకర్స్.

ఎంత బలంగా మొదలుపెట్టారో.. 2024ను అంతే బలంగా ముగిస్తున్నారు కూడా. పుష్ప 2లో కిసిక్ పాటతో దేశాన్ని ఊపేసిన ఈ బ్యూటీ.. డిసెంబర్ 20న రాబిన్ హుడ్‌తో వస్తున్నారు.

సినిమా ప్రమోషన్లలో భాగంగా టీమ్ ఇచ్చే అప్‌డేట్స్ ఏమేం ఉండబోతున్నాయన్నది నెట్టింట్లో జరుగుతున్న చర్చ. అతి త్వరలోనే ముంబైలోనూ ఓ ఈవెంట్ ఉంటుందన్నది నార్త్ ఫ్యాన్స్ ని ఊరిస్తు్న విషం.

కొత్తగా ట్రై చేసినా.. బేస్‌ని వదలకుండా కవర్ చేయాలన్నది పుష్ప పబ్లిసిటీ స్ట్రాటజీ. అందుకే హీరో, హీరోయిన్లు ముందుండి పబ్లిసిటీ పనులు చూసుకుంటున్నారు.

అటు సుకుమార్ ప్రాడెక్ట్ క్వాలిటీ కోసం నాన్‌స్టాప్‌గా పనిచేస్తూనే ఉన్నారు. ఇటు ఫ్యాన్స డిసెంబర్ 5 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.




