Chinni Enni |
Updated on: Nov 27, 2024 | 5:48 PM
శరీరంలో నాభి కేంద్రంగా బొడ్డు ఉండే ప్రాంతాన్ని పిలుస్తారు. బొడ్డును ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం బొడ్డు దగ్గర నుంచే ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తారు. రాత్రి పడుకునే ముందు బొడ్డుపై నెయ్యి రాస్తే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.
నెయ్యిని ఆయుర్వేదంలో ఎన్నో రకాల సమస్యలను కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. శరీరానికి ఉపయోగ పడే విటమిన్ ఏ, డి, ఈ, కె, బ్యూట్రిక్ యాసిడ్ కూడా లభిస్తాయి.
రోజూ రాత్రి నిద్రించే ముందు బొడ్డు చుట్టూ ఒక్క చుక్క నెయ్యి రాసుకున్నా అనే అద్భుతాలు జరుగుతాయి. ఇలా రాయడం వల్ల ఎన్నో చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మొటిమల సమస్యలు దూరం అవుతాయి. చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది.
అదే విధంగా చలికాలంలో ఎక్కువగా పెదవులు పగిలిపోతూ ఉంటాయి. ఎంతలా కేర్ తీసుకున్నా, నీటిని తాగినా పెదాలు పగిలిపోతూ ఉంటాయి. ఇలాంటి వారు నాభిపై నెయ్యి రాసుకుంటే సమస్య కంట్రోల్ అవుతుంది. బొడ్డు చుట్టూ పేరుకున్న కొవ్వు కూడా కరుగుతుంది
రాత్రి పూట నిద్రించే ముందు నెయ్యి రాసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. శరీరం అంతా రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దీంతో జబ్బులు రావడం తగ్గుతుంది. అదే విధంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)