Game Changer: శంకర్ రేంజ్‌లో ప్లానింగ్.. గేమ్ చేంజర్ గ్లోబల్ వైబ్స్
సినిమాల రేంజ్ పెరగడం అంటే స్టార్ట్ కావడానికి ముందు బడ్జెట్, రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర నెంబర్లు భారీగా కనిపించడం కాదు. అమలాపురం టు అమెరికా సినిమా పేరు మారుమోగిపోవాలి. సినిమా వాళ్లు వెళ్లి లోకల్ ఆడియన్స్ ని పలకరించాలి. అప్పుడు సిసలైన రేంజ్ వచ్చినట్టు. ఆ విషయాన్ని ఎప్పుడో గమనించారు కెప్టెన్ శంకర్. అందుకే తన మూవీస్‌కి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తుంటారు శంకర్..
Updated on: Nov 27, 2024 | 9:55 PM

అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలి భారతీయ సినిమా అంటూ గేమ్ చేంజర్ మూవీని తెగ వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అయితే, ఈ ఆలోచన కచ్చితంగా శంకర్‌దే అంటున్నారు మూవీ లవర్స్.

సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్లలో జోరు చూపిస్తున్నారు గేమ్ చేంజర్ టీమ్. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఈవెంట్‌ని అనౌన్స్ చేశారు.

ఇటు పాటల రిలీజుల్లోనూ ఫాస్ట్ గా ఉన్నారు. అంతా బావుంది.. మరి తెలుగు స్టేట్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారూ.. అంటారా.?

ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే రోబో2.0 ఈవెంట్‌ని దుబాయ్‌లో పెట్టారు శంకర్. లేటెస్ట్ గా సింగపూర్‌లో ఇండియన్2 ఈవెంట్ కూడా జనాలను అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఈవెంట్లన్నిటినీ మరిపించేలా చరణ్ గేమ్‌చేంజర్ ప్రీ రిలీజ్‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సారి దిల్‌రాజు అండ్ చెర్రీ క్రేజ్ కూడా యాడ్ కావడంతో అమెరికా ఈవెంట్ కొన్ని జనరేషన్స్ చెప్పుకునేంత గ్రాండ్‌గా జరుగుతుందనే టాక్ మాత్రం వైరల్ అవుతోంది.




