2016లో జాకోబిన్ట్ స్వర్గరాజ్యం అనే మళయాళీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది రెబా మోనికా జాన్. ఆ తర్వాత మలయాళం, తమిళం పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇటీవల శ్రీవిష్ణుకి జోడిగా సామజవరగమన చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగులో తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ వయ్యారి. మోడలింగ్ రంగంలో తన కెరియర్ మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.