- Telugu News Photo Gallery Cinema photos Reba Monica John latest Gorgeous Pics goes viral in internet
Reba Monica John: లోకం అంత తిరిగిన ఈ కోమలి వంటి అందం దొరకునా.. రెబా లుక్స్ అదుర్స్..
రెబా మోనికా జాన్ ఒక భారతీయ నటి మరియు మోడల్, ఆమె తమిళ మరియు మలయాళ చిత్రాలలో ప్రముఖంగా పని చేస్తుంది మరియు కొన్ని తెలుగు మరియు కన్నడ చిత్రాలలో పని చేసింది. తాజా సోషల్ మీడియా ఈ కోమలి షేర్ చేసిన తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా వీటిపై ఓ లుక్ వెయ్యండి.
Updated on: Jul 14, 2024 | 8:47 AM

రెబా మోనికా జాన్ ఒక భారతీయ నటి మరియు మోడల్, ఆమె తమిళ మరియు మలయాళ చిత్రాలలో ప్రముఖంగా పని చేస్తుంది మరియు కొన్ని తెలుగు మరియు కన్నడ చిత్రాలలో పని చేసింది. తాజా సోషల్ మీడియా ఈ కోమలి షేర్ చేసిన తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా వీటిపై ఓ లుక్ వెయ్యండి.

4 ఫిబ్రవరి 1994న కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ మలయాళీ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రెబ మోనికా జాన్. ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు జాన్, ఈమె తల్లి పేరు మినీ జాన్. ఈ బ్యూటీ కుటుంబం క్రైస్తవ మతానికి చెందినవారు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో సేక్రేడ్ హార్ట్ గర్ల్స్ హై స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ భామ. బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందింది ఈ అందాల తార రెబ.

2022లో క్రైస్తవ సంప్రదాయంలో కుటుంబీకులు, బంధుమిత్రుల మధ్య జోమోన్ జోసెఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ వయ్యారి సినిమాలకు ముందు కొన్ని ప్రకటనలలో కనిపించింది. అందులో ధాత్రి హెయిర్ ఆయిల్ ప్రకటన చాల ప్రముఖమైనది.

2016లో జాకోబింటే స్వర్గరాజ్యం అనే మలయాళీ ఫ్యామిలీ డ్రామాతో సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత మలయాళీ, తమిళ చిత్రాల్లో కనిపించింది. 2023లో శ్రీవిష్ణుకి జోడిగా కామెడీ డ్రామా చిత్రం సామజవరగమన చిత్రంతో తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది రెబ జాన్.