- Telugu News Photo Gallery Cinema photos Reasons why these films in Tollywood are stopped before they start
Shelved Movies: మొదలు కాక ముందే ఆగిపోయిన సినిమాలు.. అదే కారణమా.?
ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ అవుతున్నప్పుడు వచ్చే చప్పుడు కన్నా, క్రేజీ విషయాలకు ఫుల్‌స్టాప్ పడుతున్నప్పుడు వినిపించే సౌండ్ ఎక్కువగా ఉంటుంది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఇలాంటి సౌండ్‌లే రీసౌండ్ చేస్తున్నాయి. ఇవాళో రేపో స్టార్ట్ అవుతాయనుకున్న ప్రాజెక్టులకు ఎందుకు ఫుల్‌స్టాప్ పడుతున్నట్టు... హావ్ ఎ లుక్...
Updated on: Jun 20, 2024 | 8:00 AM

బలగం సినిమాతో డైరక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వేణు. బలగం తర్వాత నాని హీరోగా వేణు ఓ సినిమా చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కేన్సిల్ అయింది అనేది టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట.

ఉన్నపళాన ఎందుకు కేన్సిల్ అయింది? అని ఆరా తీస్తే, 'ఆల్రెడీ దసరా డైరక్టర్‌తో నాని చేయబోయే సినిమా కాన్సెప్ట్ కూడా ఇలాగే ఉంటుందట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని వద్దనుకున్నారు...' అనే విషయం రివీల్ అయింది.

నాని - వేణు మూవీ మాత్రమే కాదు, అల్లు అర్జున్ - అట్లీ సినిమా కూడా ఇప్పట్లో లేనట్టే అనే వార్తలు ఊపందుకుంటున్నాయి. అట్లీ చెప్పిన కథ బన్నీకి ఎగ్జయిటింగ్‌గా అనిపించలేదనే టాక్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నారు బన్నీ.

ఆ మధ్య తారక్ - త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు. కానీ, కథ కుదరకపోవడంతో అది ముందుకు సాగలేదు. అయితే ఇది ఎందుకు ఆగిపోయింది అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.

రీసెంట్ టైమ్స్ లో షెల్వ్ అయింది రవితేజ - గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన క్రెడిట్ ఉంది ఈ కాంబోకి. కాకపోతే మొన్నీమధ్య అనుకున్న సబ్జెక్టుకి బడ్జెట్ భారీగా అవుతుండటంతో స్టార్ట్ కాకముందే చెక్ పెట్టేశారు మేకర్స్.




