- Telugu News Photo Gallery Cinema photos Tollywood movie shootings have reached Hyderabad after completing the shooting schedule in the neighbourhood
Movie Updates: సొంత గూటికి చేరిన షూటింగ్స్.. పూర్తైన పొరుగు షెడ్యూల్స్..
మొన్న మొన్నటిదాకా అటూ ఇటూ అంటూ ఎటెటో జరుగుతున్న షూటింగ్‌లన్నీ ఇప్పుడు హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాయి. స్టార్ హీరోల అందరి సినిమాలతో కళకళలాడిపోతోంది భాగ్యనగరం. ఇంతకీ ఏ సెట్లో ఏ సినిమా జరుగుతోంది? చూసేద్దాం వచ్చేయండి...
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Jun 20, 2024 | 8:30 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో జరుగుతోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ది మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పుష్ప 2 రామోజీ ఫిలిం సిటీలో స్పీడందుకుంది..

మొన్న మొన్నటిదాకా వైజాగ్‌లో ఉన్న గేమ్ చేంజర్ టీమ్ ఇప్పుడు భాగ్యనగరంలో ల్యాండ్ అయింది. నానక్‌రామ్ గూడలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు.

రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ పాటల చిత్రీకరణ అల్యూమినియం ఫ్యాక్టరీ లో సాగుతోంది. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కితున్న చిత్రమిది. ఆగష్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.

రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్‌లో రూపొందుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. అన్నపూర్ణ స్టూడియో లో చిత్రీకరిస్తున్నారు. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల డైరక్ట్ చేస్తున్న విశ్వం సినిమా షూటింగ్ చింతల్ పరిసరప్రాంతాల్లో జరుగుతోంది.

శర్వానంద్ , అభిలాష్ కంకర కాంబో లో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శంషాబాద్ లో స్పీడందుకుంది. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ ముంబయికి షిఫ్ట్ అయింది.





























