- Telugu News Photo Gallery Cinema photos Shraddha Kapoor Shares Her Rumoured Boyfriend Post Goes Viral telugu movie news
Shraddha Kapoor: తనకంటే చిన్నవాడితో ప్రేమాయణం.. అతడితో రిలేషన్షిప్ కన్ఫార్మ్ చేసిన హీరోయిన్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాతో ఇటు తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. స్త్రీ 2, చందు ఛాంపియన్ చిత్రాల్లో నటిస్తున్న శ్రద్ధా.. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.
Updated on: Jun 19, 2024 | 9:21 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాతో ఇటు తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

స్త్రీ 2, చందు ఛాంపియన్ చిత్రాల్లో నటిస్తున్న శ్రద్ధా.. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమా నుంచి రైటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి ఈవెంట్లకు హాజరవుతున్నారు.

ఈ సినిమా తర్వాత రాహుల్, శ్రద్ధా కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్లకు, పార్టీలకు హాజరవుతున్నారు. అలాగే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లోనూ కనిపించారు. ఇటీవల ఆమె ఇన్ స్టాలో ఆర్ అనే అక్షరం ఉన్న లాకెట్ వేసుకుని కనిపించింది.

దీంతో రాహుల్, శ్రద్ధా డేటింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలయ్యింది. తాజాగా శ్రద్ధా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తాజాగా రాహుల్ చేయి పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తమ డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

రాహుల్ చేయి పట్టుకుని నవ్వుతూ కనిపించింది. "నా మనసును తీసుకెళ్లు.. కానీ నా నిద్రను తిరిగిచ్చేయ్" అనే క్యాప్షన్ ఇచ్చింది. అలాగే నవ్వుతున్న ఎమోజీలతోపాటు హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఆమె అధికారికంగా తమ రిలేషన్ చెప్పేశారని ఫ్యాన్స్ అంటున్నారు.




