- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna shines in bollywood bags another blockbuster
Rashmika Mandanna: లక్కీ గాళ్‌గా మారిపోతున్న రష్మిక.. ఏ ఇండస్ట్రీలో అయినా..
ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ ముద్ర ఇట్టే వచ్చేస్తుంది కానీ గోల్డెన్ లెగ్ అనేది మాత్రం చాలా కష్టం. దానికి టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈ రెండూ తనకున్నాయంటున్నారు రష్మిక మందన్న. ఆల్రెడీ టాలీవుడ్‌లో చేసిన మ్యాజిక్కే ఇప్పుడు బాలీవుడ్‌లోనూ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఛావాతో అమ్మడి రేంజ్ మరింత పెరిగిపోయింది.
Updated on: Feb 15, 2025 | 6:56 PM

అదృష్టం అలా ఉంది మరి ఏం చేస్తాం..? ఇప్పుడు రష్మిక మందన్నను చూసి ఇదే అంటున్నారు బాలీవుడ్ ఆడియన్స్. లక్కీ గాళ్‌గా మారిపోతున్నారు ఈ బ్యూటీ.

గుడ్ బై అంటూ ఫ్లాప్ సినిమాతో అక్కడ అడుగు పెట్టినా.. యానిమల్ తర్వాత రష్మిక రేంజ్ మారిపోయింది. నేషనల్ క్రష్ అయిపోయారు. తాజాగా ఛావాతో అమ్మడి స్థాయి మరింత పెరిగింది.

బాలీవుడ్‌లో పాగా వేయాలంటే గ్లామర్ షో చేయాలి.. ఇంటిమేట్ సీన్స్‌లో ఇబ్బంది పడకూడదు.. హాట్ సీన్స్‌కు నో చెప్పకూడదంటారు. కానీ రష్మిక మందన్న మాత్రం సింపుల్‌గా తన నటనతోనే పడేస్తున్నారు.

యానిమల్‌లో అమ్మడి పర్ఫార్మెన్స్‌కు హోల్ ఇండియా ఫిదా అయిపోయింది. ఇక శ్రీవల్లిగా పుష్ప 2లో రష్మిక నటన అద్భుతం అంతే. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావాలోనూ మహారాణి ఏసుబాయిగా అద్భుతమైన నటనతో మాయ చేసారు రష్మిక.

విక్కీ నటనకు ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో.. రష్మికపైనా అంతే పొగడ్తల వర్షం కురుస్తుందిప్పుడు. తెలుగులో కూడా ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి విజయాలతో లక్కీ గాళ్ అయిపోయారు. బాలీవుడ్‌లోనూ ఇదే చేస్తున్నారిప్పుడు.




