Rajitha Chanti |
Updated on: Mar 08, 2023 | 6:40 PM
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రాశీ ఖన్నా. నటనతో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో అలరించేందుకు సిద్ధమయ్యింది.
మద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. తెలుగుతోపాటు.. మలయాళ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తాను నటించిన మద్రాస్ కెఫె సినిమా అయిపోయాక రాజమౌళి బహబలి సినిమా కోసం అడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలిసిందే. తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం అడిషన్ జరుగుతుందని.. ఆ రోల్ కోసం నన్ను పిలిచారు.
అడిషన్ కోసం వెళ్లాను. కానీ నన్ను రాజమౌళి చూసి చాలా క్యూట్ గా ఉందీ అమ్మాయి. ఏదైనా లవ్ స్టోరీకి బాగా సెట్టవుతుంది అన్నారు. నా స్నేహితుడొకరు మంచి ప్రేమకథపై వర్క్ చేస్తున్నాడు. ఓసారి ఆ కథ విను. నీకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
అలా ఊహలు గుసగుసలాడే సినిమాతో నేను తెలుగులోకి లాంచ్ అయ్యాను. కానీ రాజమౌళి సినిమాలో చిన్న పాత్రైనా చేయాలనుంది అంటూ చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.
ప్రస్తుతం రాశీ ఖన్నా.. సర్దార్ 2 తమిళ్ మూవీతోపాటు.. హిందీలో యోధ చిత్రంలో నటిస్తోంది.అలాగే తెలుగుతోపాటు.. మరిన్ని చిత్రాల్లో నటించేందుకు ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది.
'బాహుబలి సినిమా కోసం ఛాన్స్ వచ్చింది.. కానీ నన్ను చూసి రాజమౌళి ఆ మాట అన్నారు'.. రాశీ ఖన్నా కామెంట్స్..