- Telugu News Photo Gallery Cinema photos Ranbir Kapoor and Rashmika Mandanna movie Animal coming with a well planned strategy for promotions
Animal: పక్కా ప్లానింగ్‌తో వస్తున్న యానిమల్.. ప్రమోషన్స్ లో కొత్త స్ట్రాటజీ
సినిమా చేయడం కాదు.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసుకున్నపుడే బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగా మాస్టర్ డిగ్రీ చేసారు. యానిమల్ కోసం ముందు నుంచి పక్కా ప్లానింగ్‌తో వస్తున్నారు ఈయన. మరీ ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఓ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. మరి అదేంటి..? యానిమల్ కోసం సందీప్ ఏం చేస్తున్నారు..? యానిమల్ పేరుకు హిందీ సినిమా అయినా.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడంతో తెలుగులోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోతుంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Nov 17, 2023 | 2:55 PM

సినిమా చేయడం కాదు.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసుకున్నపుడే బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగా మాస్టర్ డిగ్రీ చేసారు. యానిమల్ కోసం ముందు నుంచి పక్కా ప్లానింగ్‌తో వస్తున్నారు ఈయన. మరీ ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఓ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. మరి అదేంటి..? యానిమల్ కోసం సందీప్ ఏం చేస్తున్నారు..?

యానిమల్ పేరుకు హిందీ సినిమా అయినా.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడంతో తెలుగులోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోతుంది. పైగా ఈ ప్రమోషన్‌లో సపరేట్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు దర్శకుడు. తాజాగా ఆహాలో అన్‌స్టాపబుల్‌కు కూడా వచ్చారు ఈ టీం. నవంబర్ 24న ఈ ఎపిసోడ్ ప్లే కానుంది.

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. యానిమల్ ఫస్ట్ అనౌన్స్ చేసినపుడు అసలు క్రుయాలిటీ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తానన్నారు సందీప్ వంగా. అన్నట్లుగానే టీజర్ విడుదలైనపుడే అందులో కావాల్సినంత రక్తపాతం చూపించారు.. ఆ తర్వాత ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా హైలైట్ చేస్తున్నారు సందీప్.

అమ్మాయి పాటలో రొమాంటిక్ సీన్స్ బాగా డిజైన్ చేసిన సందీప్.. ఆ తర్వాతి పాటలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు భార్యా భర్తల మధ్య రిలేషన్ హైలైట్ చేసారు.

ఇక మొన్న నాన్న సాంగ్‌లోనూ ఫ్యామిలీ రిలేషన్ చూపించారు సందీప్ వంగా. తన సినిమా హోల్ సమ్ ఎంటర్‌టైనర్ అని ప్రమోట్ చేస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల కానుంది యానిమల్. దానికితోడు టాలీవుడ్‌పైనే ఫోకస్ ఎక్కువగా చేస్తున్నారు.





























