- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Fans Fires on Game changer Movie director Shankar details Here Telugu Heroes Photos
Ram Charan: డైరెక్టర్ పై చెర్రీ ఫ్యాన్స్ గరం గరం.. చరణ్ మూవీ రిలీజ్ పై అనుమానాలు..
గేమ్ ఛేంజర్ సినిమాకు శంకర్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. ఇంకా చాలా..! అదేంటి డైరెక్షన్ కాకుండా ఇంకేం చేస్తున్నారబ్బా అనుకోవచ్చు కానీ కనిపించకుండా ఆయన చాలానే చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు. ఏ చిన్న న్యూస్ పుట్టుకొచ్చినా వెంటనే ఆయనే రంగంలోకి దిగుతున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్‌పై కుండ బద్ధలు కొట్టారు శంకర్. ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో రామ్ చరణ్ కాస్త వెనక బడ్డారంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Updated on: Oct 12, 2023 | 12:17 PM

గేమ్ ఛేంజర్ సినిమాకు శంకర్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. ఇంకా చాలా..! అదేంటి డైరెక్షన్ కాకుండా ఇంకేం చేస్తున్నారబ్బా అనుకోవచ్చు కానీ కనిపించకుండా ఆయన చాలానే చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు.

ఏ చిన్న న్యూస్ పుట్టుకొచ్చినా వెంటనే ఆయనే రంగంలోకి దిగుతున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్‌పై కుండ బద్ధలు కొట్టారు శంకర్. ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో రామ్ చరణ్ కాస్త వెనక బడ్డారంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

రాజమౌళి సినిమా వచ్చిన ఏడాదిలోపే కనీసం మరో సినిమా వచ్చుంటే బాగుండేదని.. కానీ అనుకోకుండా గేమ్ ఛేంజర్ ఆలస్యమవుతూ ఉండటంతో చరణ్‌కు మళ్లీ లాంగ్ బ్రేక్ తప్పట్లేదు. ఈ విషయంలోనే దర్శకుడు శంకర్‌పై కోపంగా ఉన్నారు ఫ్యాన్స్.

గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ చెప్పాలంటూ శంకర్‌ను సోషల్ మీడియాలో అడుగుతూనే ఉన్నారు అభిమానులు. మరోవైపు సినిమాపై వస్తున్న గాసిప్స్‌కు స్వయంగా శంకర్ ఫుల్ స్టాప్ పెడుతున్నారు.

ఇండియన్ 2పై ఫోకస్ చేస్తూ.. గేమ్ ఛేంజర్‌ను పట్టించుకోవట్లేదంటూ వార్తలొస్తున్న తరుణంలో.. వెంటనే చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు శంకర్. అక్టోబర్ 10న హైదరాబాద్‌లో గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ మొదలైంది.ఎమోషనల్ సీన్స్ ఇందులో చిత్రీకరించబోతున్నారు శంకర్.

అంతేకాదు త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇండియన్ 2 షూట్ పూర్తి కావడం గేమ్ ఛేంజర్‌కు కలిసొచ్చే విషయం. ఇకపై చరణ్ సినిమాతోనే బిజీ కానున్నారు శంకర్. సినిమా 2024లో విడుదల కానుంది.




