- Telugu News Photo Gallery Cinema photos Rajamouli give hint to mahesh babu ssmb29 movie name is garuda
SSMB29: మహేష్ బాబు సినిమా టైటిల్ చెప్పేసిన రాజమౌళి !! ఆనందంలో ఫ్యాన్స్
RRR తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం SSMB29 అన్న విషయం అందరికి తెలిసిందే.. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై ప్రపంచం వ్యాప్తంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.. గుంటూరు కారం సినిమా తరువాత మహేష్.. తన టైమ్ మొత్తాన్ని జక్కన్న చేతిలో పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.
Updated on: Aug 24, 2024 | 1:57 PM

లేటెస్ట్ గా స్క్రిప్టు విషయంలో ఏమైనా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకున్నారా.? బాహుబలి తర్వాత జక్కన్న ఏ ప్రాజెక్టు డీల్ చేయాలనుకున్నారని గతంలో ఓ ప్రశ్న ఎదురైనప్పుడు గరుడ అనే పేరు వినిపించింది.

ఇంతకీ రాజమౌళి.. సూపర్‌స్టార్ సినిమా గురించి ఈ ఏడాదే అనౌన్స్ చేస్తారా? లేకుంటే వచ్చే ఏడాది దాకా ఊరిస్తూనే ఉంటారా? బాగా జుట్టు పెంచి మహేష్ కూడా మేకోవర్ అవుతున్నారు.

అయితే, ఈ సినిమాకు జేమ్స్ కేమరూన్ సమర్పకుడిగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. స్టార్ కాస్ట్ గురించి, సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేవారి గురించి జక్కన్న స్పెషల్‌గా డిక్లేర్ చేస్తే తప్ప ఈ హడావిడి మొత్తం ఆగేలా లేదంటున్నారు మరికొందరు.

ఈ సారి జక్కన్న టేకప్ చేయబోయే సబ్జెక్టుకి పురాణాల టచ్ ఇస్తున్నారని ఫిక్సవుతున్నారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో మహేష్‌ని ఎలా చూపిస్తారోననే ఆసక్తి గట్టిగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమా ఉంటుందని చెబుతూనే ఉన్నారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్.

జక్కన్న టీమ్‌తో పనిచేసే పర్సన్స్ ఎవరెక్కడ చప్పుడు చేసినా వెంటనే అలర్ట్ అవుతున్నారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్. లేటెస్ట్ గా మెటల్‌లో కనిపించిన వింగ్స్ ని వైరల్ చేస్తున్నారు. వాటిని బట్టి చూసినా, ప్రాజెక్ట్ గరుడ ఇదేనంటూ మాట్లాడుకుంటున్నారు.




