- Telugu News Photo Gallery Cinema photos Rajamouli and sandeep reddy vanga doing magic in making films
Rajamouli VS Sandeep: మేకింగ్‌లో మేజిక్ చేస్తున్న రాజమౌళి – సందీప్ రెడ్డి..
మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం స్క్రీన్ మీద కనిపించాలి. అప్పుడే... బొమ్మ చూసిన ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఆ నమ్మకమే గెలుపు మంత్రం అవుతుంది. ఆ ఫార్ములా తెలిసిన డైరక్టర్లు సౌత్ ఇండియాలో ఇద్దరున్నారు. వాళ్లెవరో తెలుసా.. అంటూ చెప్పబోయే విషయానికి బ్రేక్ వేశారు నార్త్ మేకర్ కరణ్ జోహార్. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరో మీరు ఊహించారా?
Updated on: Feb 19, 2025 | 10:02 PM

ఎత్తర జెండా అనే మాటను స్క్రీన్ మీదే కాదు, రియల్ లైఫ్‌లోనూ నిజం చేసి చూపించారు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడు, ఇంటర్నేషనల్ డయాస్ మీద ఆయనకున్న రెస్పెక్ట్ అలాంటిది.

అందుకే ఆయన కనిపించగానే సక్సెస్ ముద్ర ఆటోమేటగ్గా పడిపోతోంది. ఆ విషయాన్నే చెప్పారు కరణ్ జోహార్. రాజమౌళికే కాదు, సందీప్ రెడ్డి వంగాకు కూడా మేకింగ్ మీద ఓ గ్రిప్ ఉంటుంది.

తాను చేయాలనుకున్ సీన్‌ని ఎవరి కోసమూ కాంప్రమైజ్ అయ్యి తీయరు. మహిళలు ఏమనుకుంటారు? మగవారు ఎలా ఫీలవుతారు.. ఈ విషయాలన్నీ ఆయనకు డోంట్ కేర్ అని చెప్పేశారు కరణ్.

సందీప్ ఫోకస్ అంతా ఒక్కదాని మీదే.. తాను అనుకున్న ప్రకారమే సీన్.. స్క్రీన్ మీద ఎలివేట్ అవుతుందా? లేదా? అన్నదే అంటారు నార్త్ మేకర్. మేకింగ్ మీద అంత గ్రిప్ ఉంది కాబట్టే, రిజల్టుతో సంబంధం లేకుండా రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా సినిమాలు వేల కోట్లు వసూలు చేస్తున్నాయి.

ఇప్పుడు మహేష్‌తో రాజమౌళి చేసే సినిమా, ప్రభాస్‌తో సందీప్ చేసే స్పిరిట్ హిస్టరీని తిరగరాయడం గ్యారంటీ అనే టాక్ స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది.. ఏమంటారూ.. మీ మాట కూడా అదేనా!




