- Telugu News Photo Gallery Cinema photos Vishwambhara hari hara veeramallu kingdom movie shoots latest update on 19 02 2025
సెట్స్‌పై స్టార్ హీరోల సినిమాలు.. ఎవరెవరు ఎక్కడున్నారంటే
సినిమాలన్నీ ఆన్ సెట్స్ లో స్పీడు మీదే ఉన్నాయా? లేకుంటే, నిలిచి నిదానంగా సాగుతున్నాయా? సీనియర్ హీరోలు నలుగురిలో షూటింగ్‌కి అటెండ్ అవుతున్నవారు ఎవరెవరు? స్టార్ హీరోల సిట్చువేషన్ ఏంటి? యంగ్‌స్టర్స్ ఎక్కడెక్కడున్నారు? కమాన్ లెట్స్ వాచ్... విశ్వంభర కోసం రీసెంట్‌గా మెగాస్టార్ ఇంట్రో సాంగ్ షూట్ చేశారు.
Updated on: Feb 19, 2025 | 10:17 PM

విశ్వంభర కోసం రీసెంట్‌గా మెగాస్టార్ ఇంట్రో సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగ్‌లో గెస్ట్ గా కనిపించారు సాయిధరమ్‌తేజ్. ఓ వైపు విశ్వంభర షూట్ చేస్తూనే, మరో వైపు తుక్కు గూడలో తన సినిమా షూటింగ్‌కి హాజరయ్యారు మెగా మేనల్లుడు.

ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ అజీజ్ నగర్‌లో, ఫౌజీ అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 3 సినిమా షూటింగ్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో జరుగుతుంది.

నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హిట్ 3 కూడా అక్కడే కంటిన్యూ అవుతోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ శంషాబాద్ ముచ్చింతల్ లో కంటిన్యూ అవుతోంది.

హలో నేటివ్ స్టూడియోలోనో పవర్‌స్టార్ కోసం ఓ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే శర్వానంద్ కోసం, ఆనంద్ దేవరకొండ కోసం సెట్ వర్క్స్ జరుగుతున్నాయి.

రవితేజ హీరోగా భాను బొగ్గవరపు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ అరకు లో స్పీడ్ అందుకుంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్డమ్ చిత్రం షూటింగ్ విశాఖ పట్నం లో జరుగుతుంది.




