- Telugu News Photo Gallery Cinema photos Lokesh kanagaraj new plan with vijay and Kamal Haasan in karthi kaithi 02
Kaithi 02: ఖైదీ2 క్లైమాక్స్ లో విజయ్ వాయిస్ వినిపిస్తుందా
ఒక్క దెబ్బకు రెండు పిట్టల సంగతి విన్నాం గానీ, మూడు సినిమాలకు ఒక్క ప్రీక్వెల్ గురించి ఎప్పుడూ వినలేదే.. అంటారా? యస్.. నెవర్ బిఫోర్ అన్నదాన్ని చేసి చూపించడానికే నేనున్నానంటున్నారు లోకేష్ కనగరాజ్. మిస్టర్ లోకేష్ వేసిన స్కెచ్ గురించి ఒకింత ఆశ్చర్యంగానే చెప్పుకుంటోంది కోలీవుడ్. ఇంతకీ ఏంటా బడా స్కెచ్...
Updated on: Feb 19, 2025 | 10:31 PM

ఒక్క దెబ్బకు రెండు పిట్టల సంగతి విన్నాం గానీ, మూడు సినిమాలకు ఒక్క ప్రీక్వెల్ గురించి ఎప్పుడూ వినలేదే.. అంటారా? యస్.. నెవర్ బిఫోర్ అన్నదాన్ని చేసి చూపించడానికే నేనున్నానంటున్నారు లోకేష్ కనగరాజ్. మిస్టర్ లోకేష్ వేసిన స్కెచ్ గురించి ఒకింత ఆశ్చర్యంగానే చెప్పుకుంటోంది కోలీవుడ్. ఇంతకీ ఏంటా బడా స్కెచ్...

ఇప్పుడు కూలీ సినిమా పనుల్లో ఉన్న లోకేష్ కనగరాజ్, త్వరలోనే ఖైదీ సెకండ్ చాప్టర్‌ని మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకూ, విజయ్ లియోకూ లింకు పెట్టేస్తున్నారు నెటిజన్లు.

ఖైదీ 2.. ఖైదీ మూవీకి సీక్వెల్ కాదని, ప్రీక్వెల్ అనీ, ఎండింగ్‌లో.. మిస్టర్ లియో విజయ్ వాయిస్ వినిపిస్తుందని కోలీవుడ్ టాక్. ఖైదీ, విక్రమ్ కథలను సేమ్ టైమ్‌లైన్‌లోనే చూపించారనేది అబ్జర్వర్స్ చెప్పే మాట.

సో, ఇప్పుడు ఖైదీకి చేసే ప్రీక్వెల్‌లోనే, విక్రమ్ ప్రీ స్టోరీ కూడా ఉంటుందట. లోకేష్ చెప్పిన వండర్ ఫుల్ నెరేషన్ నచ్చి, ఈ మూవీలో పార్ట్ కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట కమల్‌హాసన్.

ఖైదీ 2లో సూర్య కనిపించడం గ్యారంటీ అనే మాట ఎప్పటి నుంచో ఉంది. సో నెక్స్ట్ లోకేష్ స్టార్ట్ చేసే ఖైదీ.. విక్రమ్, లియో, రోలెక్స్ కేరక్టర్లతో పండగలా ఉంటుందన్నమాట. ఇప్పుడు లోకేష్ స్టార్ట్ చేయబోయే ఈ ప్రీక్వెల్ కహానీ అందరికీ వావ్ ఫ్యాక్టర్.