- Telugu News Photo Gallery Cinema photos Puri jagannadh hopes on Balakrishna with next movie, harish shankar hopes on pawan kalyan Ustaad Bhagat Singh, details here Telugu Heroes Photos
Pawan Kalyan – Balakrishna: వాళ్లందరి బాధ్యత బాలయ్య – వపన్ కల్యాణ్ మీదే ఉందా.?
నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నియర్ ఫ్యూచర్‌లో రిలీజ్ చేయబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్‌కి తెర లేపినట్టయింది. ఒకరూ, ఇద్దరూ కాదు.. అంతకు మించే.. కెప్టెన్లు వీళ్లిద్దరు ఇచ్చే హిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వీక్ థియేటర్లలోకి వచ్చిన ఇద్దరు కెప్టెన్లు కూడా ఈ లిస్టులో కనిపించడం విశేషం.! నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే 109 సినిమా కీ షెడ్యూల్స్ పూర్తయినట్టే.
Updated on: Aug 21, 2024 | 9:34 PM

నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నియర్ ఫ్యూచర్‌లో రిలీజ్ చేయబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్‌కి తెర లేపినట్టయింది. ఒకరూ, ఇద్దరూ కాదు.. అంతకు మించే.. కెప్టెన్లు వీళ్లిద్దరు ఇచ్చే హిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ వీక్ థియేటర్లలోకి వచ్చిన ఇద్దరు కెప్టెన్లు కూడా ఈ లిస్టులో కనిపించడం విశేషం.! నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే 109 సినిమా కీ షెడ్యూల్స్ పూర్తయినట్టే. మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసి, నెక్స్ట్ ప్రశాంత్ వర్మ్ షూట్ కి వెళ్తారు బాలయ్య.

ఆ తర్వాత అఖండ సీక్వెల్ చేయాలి. రామ్‌తో తీసిన స్కంధ ఫ్లాప్ కావడంతో అఖండ సీక్వెల్ మీదే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు బోయపాటి శ్రీను. త్వరలోనే బాలయ్యను కలిసి పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్ట్ నెరేట్ చేస్తారన్నది ఇప్పుడు వైరల్ అవుతున్న మాట.

ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. సో, పూరి చెప్పే కథ నచ్చితే వెంటనే సినిమా చేయడానికి బాలయ్య కాల్షీట్ ఇచ్చేస్తారనే మాట కూడా గట్టిగానే వైరల్ అవుతోంది. అదే జరిగితే ఇబ్బందుల్లో ఉన్న పూరి కెరీర్‌కి భరోసా కల్పించాల్సిన హీరో బాలయ్యే అవుతారు.

కొన్ని సినిమాలపై ఉన్న అంచనాలు చూస్తుంటే తీసేవాళ్లకు భయమేస్తుంది. అయితే అలాంటి సినిమాలు తరుచుగా కాదు.. అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడో సినిమాపై ఇలాంటి ఫోబియానే నడుస్తుంది.

ఇప్పుడు సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆ థర్డ్ ప్రాజెక్ట్.. ఇంతకీ మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో.. అర్థమైందిగా.! యస్.. ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఉస్తాద్ భగత్‌సింగ్.

అలాగే హరిహరవీరమల్లు డైరక్టర్లు క్రిష్, జ్యోతికృష్ణ ఫ్యూచర్ కూడా చాలా వరకు పవన్ కల్యాణ్ ఇచ్చే హిట్ మీద ఆధారపడి ఉందన్నది కాదనలేని విషయం.




