AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Indians : ముంబై ఇండియన్స్ ఆటతీరుపై ఫ్యాన్స్ ఫైర్.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం

Mumbai Indians : ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ కెప్టెన్సీని ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. బౌలింగ్ మార్పులు, క్లిష్ట సమయంలో ఒత్తిడికి లోనవ్వడం వంటి విషయాల్లో హార్దిక్ విఫలమవుతున్నాడని అంటున్నారు.

Mumbai Indians : ముంబై ఇండియన్స్ ఆటతీరుపై ఫ్యాన్స్ ఫైర్.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం
Mumbai Indains
Rakesh
|

Updated on: Apr 17, 2026 | 9:36 AM

Share

Mumbai Indians : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అన్నట్లుగా తయారైంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోవడం, అది కూడా చేతిలో ఉన్న మ్యాచులను చేజేతులా జార్చుకోవడం చూసి ముంబై ఫ్యాన్స్ సహనం కోల్పోతున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి ఆటగాళ్ల వరకు ఒక్కొక్కరిని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ కెప్టెన్సీని ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. బౌలింగ్ మార్పులు, క్లిష్ట సమయంలో ఒత్తిడికి లోనవ్వడం వంటి విషయాల్లో హార్దిక్ విఫలమవుతున్నాడని అంటున్నారు. “ఆ నవ్వు తగ్గించి గేమ్ మీద ఫోకస్ చేయ్” అంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.

జస్ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు రన్స్ కంట్రోల్ చేయలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు బూమ్రా బౌలింగ్ అంటేనే బెదిరిపోయే బ్యాటర్లు ఇప్పుడు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. అలాగే దీపక్ చాహర్, షార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంపై ముంబై బౌలింగ్ కు ఏమైంది? అని ప్రశ్నిస్తున్నారు.

గాయం నుంచి కోలుకుని వచ్చిన స్కై గోల్డెన్ డక్ అవ్వడం ఫ్యాన్స్ నిరాశకు గురిచేసింది. కీలక మ్యాచులో సున్నాకే వెనుదిరగడంపై విమర్శలు వస్తున్నాయి. క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీతో పునాది వేస్తే, మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ, హార్దిక్, రుదర్‌ఫోర్డ్ ఫినిషింగ్ చేయలేకపోయారు. 215 దాటాల్సిన స్కోరును 195 దగ్గరే ఆపేయడంపై ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.

రాజకీయాల వల్ల టీమ్ దెబ్బతింటోందా?

ముంబై డగౌట్ లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య అంతా సజావుగానే ఉందా? అన్న అనుమానాలను ఫ్యాన్స్ మళ్ళీ లేవనెత్తుతున్నారు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన క్యాచ్ పట్టినప్పుడు రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతుంటే, “కెప్టెన్ మార్పు వల్ల టీమ్ బాండింగ్ దెబ్బతింది” అని కొందరు విశ్లేషిస్తున్నారు. వరుసగా నాలుగు ఓటములు పలకరించడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్లడం ఇక అసాధ్యమేనని అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

Follow Us
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!