AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? టీటీడీ నుంచి అలర్ట్.. మూడ్రోజుల పాటు ఈ సేవలు రద్దు..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేసింది. తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? టీటీడీ నుంచి అలర్ట్.. మూడ్రోజుల పాటు ఈ సేవలు రద్దు..
Tirumala
Venkatrao Lella
|

Updated on: Apr 17, 2026 | 1:01 PM

Share

తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే మీకో గమనిక. తిరుమలలో కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. తిరుమలలో ఈ నెల 25వ తేదీ నుంచి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు తిరుమల కొండపై ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఉన్న పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తులు భారీగా వీటిని చూసేందుకు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అందులో భాగంగా మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేయనుంది.

మూడు రోజుల పాటు సేవలు రద్దు

ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. భక్తులు దీనికి తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ముందుగానే దీనిని గమనించి ఏర్పాట్లు చేసుకోవాని భక్తులకు టీటీడీ సూచించింది. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. విద్యాసంస్ధలకు సెలవులు రావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దర్శనానికి గంటల కొద్ది సమయం పడుతోంది.

కళ్యాణోత్సవం

పద్మావతి, శ్రీనివాసుల కళ్యాణోత్సవానికి గుర్తుగా పద్మావతి పరిణోత్సవాన్ని ప్రతీ ఏడాది టీటీడీ నిర్వహిస్తోంది. 1992 నుంచి ఈ వేడుకులను వైశాఖ శుద్ద దశమి నాడు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు మలయప్పస్వామి గజవాహనంపై దర్శనం ఇవ్వనుండగా.. రెండో రోజు అశ్వవాహనం, మూడో రోజు గరుడ వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. ప్రత్యేక పల్లకీల్లో పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ తన ప్రకటనలో తెలిపింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొనాలని టీటీడీ సూచించింది. ఈ మేరకు అంగరంగ వైభవంగా వేడకలకు ఏర్పాట్లు చేస్తోంది.

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!