- Telugu News Photo Gallery Cinema photos Megastar chiranjeevi birthday special his movies updates on 22 august 2024 Telugu Heroes Photos
Chiranjeevi: ఈ సారి మెగాబాస్ పుట్టినరోజు మామూలుగా ఉండదు అంట.!
ఈ సారి మెగాబాస్ పుట్టినరోజు మామూలుగా ఉండదని ఫుల్ ఖుషీ అవుతున్నారు మెగా స్టార్ అభిమానులు. ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ అంటూ తమకోసం ప్యాక్ అవుతున్న గిఫ్టుల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ బాస్ బర్త్ డేకి రెడీ అవుతున్న సర్‌ప్రైజ్‌లేంటో తెలుసా.? మీకు పార్టీ కావాలి.. అంతే కదా.. అస్సలు ఆలోచించకుండా బర్త్ డే రోజు థియేటర్లకు వచ్చేయండి.. ఒకటేంటి.? ఒకటికి రెండు సినిమాలతో పండగ చేసుకుందామని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.
Updated on: Aug 21, 2024 | 9:56 PM

చిరు కోసం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసినట్టుగా చెప్పారు. ఇప్పటికే కథ విన్న చిరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఠాగూర్ తరువాత మరోసారి ఆ రేంజ్ కథ కావటంతో దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో ఆలోచనలో పడ్డారు చిరు.

ఇంతకీ బాస్ బర్త్ డేకి రెడీ అవుతున్న సర్‌ప్రైజ్‌లేంటో తెలుసా.? మీకు పార్టీ కావాలి.. అంతే కదా.. అస్సలు ఆలోచించకుండా బర్త్ డే రోజు థియేటర్లకు వచ్చేయండి.. ఒకటేంటి?

అసలే సీక్వెల్స్ సందడి చేస్తున్న వేళ ఇంద్ర సీక్వెల్ వస్తే.. ఆ హైప్ ఇంకో రకంగా ఉంటుందిగా. ఇంద్ర గురించి ప్రస్తావన రాగానే, చిరంజీవి మనసులో మెదిలిన మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి.

అంటే పాత సినిమాల సంగతి సరే.. కొత్తగా ఏమైనా ఆశించవచ్చా? అని అడిగేవాళ్లకు.. మై హూనా అంటూ భరోసా ఇస్తున్నారు డైరక్టర్ వశిష్ట. మీరు ట్రెండ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ మొదలైన రోజే 2025 సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్.

ఆయన నయా సినిమా అనౌన్స్ మెంట్ అదే రోజు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గాడ్‌ఫాదర్‌తో తార్ మార్ టక్కర్‌మార్ చేసిన రాజా డైరక్షన్‌లో కొత్త సినిమాను ప్రకటించడానికి సిద్ధమవుతోంది మెగా కాంపౌండ్.




