AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుపై పీక్స్‌కు చేరిన చర్చ .. అసలు లోక్‌సభలో జరిగిందేంటి?

డీలిమిటేషన్ బిల్లుపై నిన్నటిదాకా సభ బయట చర్చ జరిగింది. ఇప్పుడీ రచ్చ సభ లోపలికి ప్రవేశించింది. బట్ సబ్జెక్ట్ సేమ్, అదే వర్షన్, అదే స్టాండ్, ప్రోరెటా ఫార్ములా దక్షిణాది కొంప ముంచుతుందని విపక్షాలు అంటుంటే లెక్క తగ్గితే ఒట్టు.. దక్షిణాదికి తమదీ గ్యారెంటీ అంటున్నారు మోదీ అండ్ షా.

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుపై పీక్స్‌కు చేరిన చర్చ .. అసలు లోక్‌సభలో జరిగిందేంటి?
Delimitation Bill
Anand T
|

Updated on: Apr 17, 2026 | 9:36 AM

Share

డీలిమిటేషన్ బిల్లుపై అసలుసిసలు చర్చ ఇంకా మొదలవలేదు గానీ.. లోక్‌సభలో లొల్లి మాత్రం మరో స్థాయిలో జరుగుతోంది. ఇదే టెంపోలో ఓ కొత్త పాయింట్ తీశారు సీఎం స్టాలిన్. ఔట్ అండ్ ఔట్ బ్లాక్ డ్రెస్ వేసుకుని, డీలిమిటేషన్ బిల్లు కాపీలకు నిప్పంటించి, నిరసన తెలిపారు. అలా చేస్తూ ఓ డైలాగ్ కొట్టారు సీఎం స్టాలిన్. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను డైవర్ట్ చేయడానికే కదూ ఈ హడావుడి బిల్లు అంటూ కామెంట్ చేశారు. మోదీ ప్రభుత్వం ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎలాంటి ఎత్తుగడలు వేసినా.. ఎలక్షన్స్‌ నుంచి తమ ఫోకస్ మార్చలేరు అంటూ అటెన్షన్‌లోకి వచ్చారు. డీలిమిటేషన్ బిల్లు అంశాన్ని సైతం ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడేశారు.

ఇక రాహుల్ గాంధీ పార్టీ స్టాండ్‌ను క్లియర్‌గా చెప్పారు. చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరింత పెద్దగా అయ్యే ఈ ప్రోరెటా ప్రాసెస్‌ను వ్యతిరేకిస్తున్నాం అన్నారు. అలా అంటూ ఉత్తరాదిన మరింత పట్టు పెంచుకునేందుకే బీజేపీ ఈ 50 శాతం సీట్ల పెంపు ఫార్ములా అమలు చేస్తోందని విమర్శించారు.

ప్రియాంకా గాంధీ సైతం డైలాగులతో డైనమైట్స్ పేల్చారు. మహిళా కోటా బిల్లు పేపర్లలో డీలిమిటేషన్ బిల్లు కాపీలు పెట్టి లోక్‌సభ స్థానాలు పెంచాలనుకోవడం వెనక పెద్ద కుట్రే ఉందంటున్నారు ప్రియాంక. ప్రోరెటా పద్దతిలో డీలిమిటేషన్ చేస్తే కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరగడమే కాదు.. ఈ బిల్లు ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతం అవుతుందని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి అయితే.. సీడబ్ల్యూసీ మీటింగ్‌కు వెళ్లినప్పటి నుంచి ఎక్కువసార్లు ఈ టాపిక్‌పైనే మాట్లాడారు. ప్రోరెటా డీలిమిటేషన్‌తో దక్షిణాదికి శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. బట్ ప్రతిపక్షాల వర్షన్ ఎలా ఉన్నా దక్షిణాదికి సీట్లు తగ్గవు అనే స్టాండ్‌నే మరోసారి వినిపించారు హోంమంత్రి అమిత్ షా. సౌత్ స్టేట్స్‌లో ఎక్కడెన్ని సీట్లు పెరుగుతాయో లెక్కలు చెప్పారు.

ఇక ఇది మోదీ గ్యారెంటీ అంటున్నారు ప్రధాని. డీలిమిటేషన్‌పై టెన్షన్ పెట్టుకోనక్కర్లేదు బిల్లు చూశాక, తాము చెప్పేది విన్నాక మీకే అర్థమవుతుందని ఒక చిన్నమాటతో పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు. సో ఇదీ సంగతి. డీలిమిటేషన్‌పై అసలైన డిస్కషన్ మొదలుపెట్టక ముందే ఇలా ఉంటే ఈ రెండ్రోజులు ఇంకెలా ఉంటుందో.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..